Holi 2020: హోళీ ఎందుకు జరుపుకుంటారు, ఏ యుగం నుంచి జరుపుకుంటున్నారు, హోళీ అంటే అర్థం ఏమిటీ, పండగ విశిష్టతను ఓ సారి తెలుసుకోండి
Happy Holi (File Image)

Mumbai, Mar 10: దీపావళి తర్వాత దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో హోళీ (Happy Holi 2020) ఒకటి. పురాణాల ప్రకారం ఈ పండుగను సత్య యుగం నుంచి దేశంలో జరుపుకుంటున్నట్లు తెలియజేస్తున్నాయి. హోళీ (Holi) అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం వస్తుంది. హోళీని హోళికా పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు.

Holi wishes, Messages, Quotes, Images, Status, Greetings

ఈ హోళీని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. హర్యానాలో దీని పేరు ‘కరోర్ మార్’ హోళీ. ఇక్కడ వదినలు బావలను, మరదళ్లు మరిదిని కొడతారు. ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సనా అనే గ్రామంలో హోళీని ‘లఠ్ మార్’ హోళీ అని పిలుస్తారు. ఇక్కడ పురుషులను మహిళలు మగవారిని లాఠీలతో కొడతారు.

పశ్చిమ బెంగాల్ లో శాంతినికేతన్ లో హోలీ ఉత్సవాలను జరుపుకోవాలనే విధానాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో బెంగాలీ పండుగ 'వసంత ఉత్సవం'ను జరుపుకుంటారు. పేరుకు తగినట్లే హోళీ మరియు వసంత ఋతువు ప్రారంభ సమయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారు.

హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు

ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. హోళీ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కథనాల ప్రకారం రాక్షసి హోళిక, హోలక, రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. వంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు.

పురాణాలు ఏం చెబుతున్నాయి

భక్త ప్రహ్లాదుడ్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుడి సోదరి హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు.. చాలా కాలం తపస్సు చేసి, తనకు చావు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మ నుంచి వరం పొందాడు. పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమి లేదా ఆకాశం, మనుషులు, జంతువులు, అస్త్రాలు, శస్రాలతో చావు లేకుండా వరాన్ని పొందాడు. వర గర్వంతో దేవతలపై కూడా దండెత్తాడు. మానవులు దేవతలను ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా, హిరణ్యకశిపుడు పుత్రుడు ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువుకు పరభక్తుడు.

హోళీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ

విష్ణువును ఆరాధించడం మానుకోవాలని తండ్రి బెదిరించినా, ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తిని వీడలేదు. చివరికి విసిగిపోయిన హిరణ్యకశిపుడు.. తన సోదరి హోళికతో ప్రహ్లాదుడిని ఒడిలోపెట్టుకుని చితిపై కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. మంటల నుంచి రక్షించే శాలువాను ఆమె ధరించడంతో ఎలాంటి హాని జరగదని హిరణ్యకశిపుడు భావించాడు. తన తండ్రి ఆదేశాలను శిరసావహించిన ప్రహ్లాదుడు.. మనసులో శ్రీహరిని వేడుకున్నాడు. చితి మొదలైనప్పుడు విష్ణు మాయతో ఆమె మంటల్లో కాలిపోయింది. ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడంతో అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోయిన రోజు ( (Holika dahan celebration) ఫాల్గుణ పౌర్ణమి కావడంతో ఆ రోజునే హోలీ జరుపుకుంటున్నారు.

సతీవియోగం తర్వాత విరాగిగా మారిన పరమేశ్వరుడిలో కోరికలను రగిలించి, శివుని తపస్సును భంగపరచడానికి మన్మథుడు బాణం వేయగా.. శివుడు తన మూడో కంటితో అతడిని నాశనం చేశాడు. అయితే, అతడి భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని బతికించాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలిపాడు. ఈ సంఘటనకు గుర్తుగా హోలీ రోజున మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. తల్లితో కృష్ణుడు తన శరీర వర్ణం, రాధ మేనిఛాయ మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని అంటారు. దీంతో కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.