Ganesh Chaturthi 2023: భారీ గణపతి విగ్రహాల పక్కన చిన్న విగ్రహాలను కూడా పెట్టి ఎందుకు పూజిస్తారో తెలుసా? అది తప్పనిసరా?

ప్రత్యామ్నాయంగా నిత్యపూజ నిర్వహించడానికి వీలుగా ఒక ఉపమూర్తిని (గణపతి చిన్న విగ్రహాన్ని) కూడా మంటపంలో పెట్టి, ఆవాహనం చేసి పూజించే సంప్రదాయం ఏర్పడింది. ఇది లోకాచారమే కానీ, చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువుదీర్చాలనీ, దానికే పూజలు నిర్వహించాలి అనడానికి శాస్త్ర ప్రమాణం లేదు.

Ganesh Chaturthi 2023: భారీ గణపతి విగ్రహాల పక్కన చిన్న విగ్రహాలను కూడా పెట్టి ఎందుకు పూజిస్తారో తెలుసా? అది తప్పనిసరా?
file

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥

అని రోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ, వంకర తిరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవమా.. మేం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుమని వేడుకుంటూ వినాయకుణ్ని స్తుతించే శ్లోకం ఇది. గణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతి రోజూ షోడశ ఉపచారాలతో విధిగా పూజిస్తుంటారు. నిత్యపూజల్లో, శుభకార్యాల్లో మొదటి పూజ పార్వతీ తనయుడికే చెల్లుతుంది. ఇక వినాయక చవితి సందర్భంగా వీధివీధినా మంటపాలు నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయకుడి భారీ విగ్రహాలను ఏర్పాటుచేస్తారు. భక్తులంతా ఆ వేడుకల్లో పాలుపంచుకుంటారు. పూజలో భాగంగా వినాయక ఉత్సవమూర్తిని విధిగా షోడశ ఉపచారాలతో అర్చించి అలంకరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మంటపంలో ఉన్న భారీ విగ్రహాన్ని పూజించడానికి సౌకర్యంగా ఉండదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా నిత్యపూజ నిర్వహించడానికి వీలుగా ఒక ఉపమూర్తిని (గణపతి చిన్న విగ్రహాన్ని) కూడా మంటపంలో పెట్టి, ఆవాహనం చేసి పూజించే సంప్రదాయం ఏర్పడింది. ఇది లోకాచారమే కానీ, చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువుదీర్చాలనీ, దానికే పూజలు నిర్వహించాలి అనడానికి శాస్త్ర ప్రమాణం లేదు. వినాయకుడి పూజలో భాగంగా పసుపు గణపతిని చేసి పూజించాలని శాస్త్రం చెబుతున్నది.

(The above story first appeared on LatestLY on Sep 17, 2023 11:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).