Viral

Viral Video: వీడియో ఇదిగో, మూడు సింహాలకు చుక్కలు చూపించిన చిట్టి ముంగీస, దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

Vikas M

Pushpa 2 Second Song Sooseki Out: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 రెండో సాంగ్ వీడియో ఇదిగో..

Vikas M

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప‌-2' నుంచి రెండో సాంగ్ విడుదలయింది. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది.

Tamannaah Bhatia: కుర్రకారు మతి పోగొడుతున్న తమన్నా భాటియా, అరణ్మనై 4 ప్రమోషన్‌ కోసం సరికొత్తగా..

Vikas M

తమన్నా భాటియా తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని రుజువు చేస్తోంది! అరణ్మనై 4 ప్రమోషన్ల కోసం ఈ నటి తన అద్భుతమైన లుక్‌తో అభిమానుల నోరు మూయించింది . సాధారణ రెడ్ కార్పెట్ గౌన్‌లను వదులుతూ, ఆమె హౌస్ ఆఫ్ మసాబా కస్టమ్-డిజైన్ చేసిన ఆకర్షణీయమైన సమిష్టిని ఎంచుకుంది.

Monsoon 2024 Update: వచ్చే 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు, కీలక అప్ డేట్ అందించిన భారత వాతావరణ శాఖ

Hazarath Reddy

వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) మే 29న తెలిపింది. "వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగుతాయి" అని IMD ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Delhi Water Crisis: నీటి విడుదలకు ససేమిరా అంటున్న హరియాణా. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా కట్టాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో భానుడి శివాలెత్తుతున్నాడు. మరో పక్క నీటి కరువుతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వాటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.

Heatwave in Bihar: వీడియో ఇదిగో, స్కూలుకు రాగానే ఎండ వేడిమికి సొమ్ముసిల్లి పడిపోయిన 50 మంది విద్యార్థులు

Hazarath Reddy

బీహార్ లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకోవడంతో స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో ఎండ తీవ్రతను విద్యార్థులు తట్టుకోలేకపోయారు.

Delhi Temperature: దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Crocodile in Uttar Pradesh: ఎండ కోసం నీటిలో నుండి బయటకు వచ్చిన మొసలి, మళ్లీ నీళ్లలోకి వెళ్లలేక అవస్థలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తర్ ప్రదేశ్ - బులంద్‌షహర్, నరోరా ఘాట్‌లో ఓ ముసలి గంగా నది నుండి బైటకి వచ్చి.. రైలింగ్ పై నుండి నదిలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తూ విఫలమైయింది. అయితే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. వారు ఆ ముసలిని బంధించి తిరిగి నదిలో వదిలేశారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేసిన యువకుడు, చితకబాది పోలీసులకు అప్పగించిన ప్యాసింజర్లు

Hazarath Reddy

కరీంనగర్ - శంకరపట్నం మండలం తాడికల్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌పై గాలిపెల్లి అనిల్ అనే యువకుడు చెప్పుతో దాడి చేశాడు.. దీనితో ఆగ్రహించిన ప్రయాణికులు అతడిని బస్సులోనే బంధించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Uttar Pradesh: యూపీలో మనిషి ప్రాణాల కన్నా మందు బాటిళ్ల మీదే మోజు, గాయపడిన డ్రైవర్‌ని వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. మద్యం ట్రక్కుతో ప్రమాదం జరిగిన తరువాత, సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు గాయపడిన వారిని గమనించకుండా వదిలివేసి, సిగ్గు లేకుండా రోడ్డుపై పడిన మద్యాన్ని దోచుకోవడం ప్రారంభించారు.

Road Accident Video: కారు ఉంది కదా అని రోడ్డుపైన ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకండి, అమాయకుల ప్రాణాలు తీయొద్దంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

కారు ఉంది కదా అని రోడ్డుపైకి వచ్చి ఇష్టారితీన డ్రైవింగ్‌ చేసి అమాయకుల ప్రాణాలు తీయొద్దు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏమాత్రం సరికాదు. చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కుటుంబాల భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్‌ చేయండి

Indian Army Jawans Defeat China Troops: టగ్ ఆఫ్ వార్‌‌‌లో చైనా సైనికులను చిత్తుగా ఓడించిన భారత ఆర్మీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత్(india), చైనా(china) సైనికుల మధ్య తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్‌(sudan)లో మోహరించిన సమయంలో భారత సైనికులు, చైనా సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఆ క్రమంలో భారత్ సైనికులు చైనాపై విజయం సాధించారు.

Advertisement

Aadhaar-PAN Linking Update: ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? మార్చి 31 లోపు లింక్ చేసుకోవాలని ఐటీశాఖ ఆదేశాలు

Vikas M

పాన్ కార్డు గల వారంతా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుందనే విషయం విదితమే. ఇప్పటికే పాన్-ఆధార్ అనుసంధాన గడువు ముగిసిపోయింది. ఇప్పటికీ ఆధార్ తో అనుసంధానించని వారి పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోయి ఉంటుంది. అటువంటి వారు రూ.1000 ఫైన్‌తో ఆధార్-పాన్ కార్డును అనుసంధానించుకోవాలి

Ajith Kumar Rides His Superbike in Hyderabad: వీడియో ఇదిగో, తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన హీరో అజిత్‌ కుమార్

Vikas M

స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్‌ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు

Ritika Sajdeh Instagram Story: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ పాలస్తీనాకు మద్దతు తెలిపిందా ? ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో కథనం వైరల్

Vikas M

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ​​'ఆల్ ఐస్ ఆన్ రఫా' ప్రచారానికి అనుకూలంగా ఇన్‌స్టాగ్రామ్ లో కథనం వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు నెలల తరబడి కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫా నగరం దాడులతో అట్టుడికి పోతోంది

ICC T20 World Cup 2024 on DD Sports: డీడీ స్పోర్ట్స్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం, అయితే టీమిండియా మ్యాచ్‌లు మాత్రమే..

Vikas M

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ తొమ్మిదో ఎడిషన్‌ను వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (అమెరికా) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇంగ్లండ్ నిలిచింది.

Advertisement

UP Horror: వీడియో ఇదిగో, తమతో కలిసి మందు తాగలేదని స్నేహితుడిని మేడపై నుంచి తోసిన స్నేహితులు, కిందపడి దెబ్బలు తగిలినా వదలకుండా పాశవిక దాడి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు.

WHO on COVID: కరోనా కారణంగా తగ్గిన మనిషి ఆయుష్షు కాలం, ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో

Vikas M

కోవిడ్ కారణంగా మనుషుల ఆయుష్షు కాలం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజా నివేదిక వెల్లడించింది. ఈ కరోనా మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని నివేదికలో చెప్పింది. భారత దేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని అది ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది.

Next Pandemic 'Absolutely Inevitable': కరోనా సంక్షోభం మరచిపోకముందే ప్రపంచంపై మరో పిడుగు, మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరించిన బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్

Vikas M

కరోనా స‌ృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు

Cyclone Remal Effect: వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు

Hazarath Reddy

రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి

Advertisement
Advertisement