Mumbai, Febuary 29: ఒక కాలెండరు సంవత్సరంలో (Year) అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల (Month) గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం (Leap Year) అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి (Calender Year) వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది.
ఇక ఫిబ్రవరి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం లీపు సంవత్సరం లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వస్తుంది.లీప్ రోజుగా (Leap Day 2020) ఫిబ్రవరి 29ని పిలుస్తారు.ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి.
జాన్ టెన్నిఎల్ 200వ జయంతి నేడు
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అయితే నాలుగేళ్లకు ఓ సారి వచ్చే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. నిజానికి ఫిబ్రవరిలో 29వ తేదీ (February 29) ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఏడాది ఆయుష్షులో…. అదనంగా మరో రోజు జీవించినట్లే అంటున్నారు.
ఈ రోజు ఎందుకు వస్తుందనే దానికి పలు కారణాలు చెబుతారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని. ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఈజీగా చెప్పాలంటే 65 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజుల్ని కలిపి ఒక రోజుగా మార్చి లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు.
స్కాట్లాండ్ సైంటిస్ట్ మేరీ సోమెర్‌విల్లేకు గూగుల్ డూడుల్ ఘన నివాళి
ఫిబ్రవరిలోనే అదనపు రోజు ఎందుకు కలుపుతున్నారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు… కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. ఉదాహరణకు రోం చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక… కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.
జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా… ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు.
ఇక ఇప్పట్లో ఈ కేలండర్‌ను మార్చే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేవు. అందువల్ల ప్రతిసారీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి 1 రోజు యాడ్ అవుతుంది.