Fake News Alert: కుంభమేళాలో ప్రకాశ్ రాజ్ పుణ్యస్నానం.. నెటిజన్ల మండిపాటు, ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
కుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పుణ్యస్నానం ఆచరించారని ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు(Maha Kumbh) భక్తులు పోటెత్తారు. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించగా కొంతమంది ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పుణ్యస్నానం ఆచరించారని ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాస్తికుడు అని చెప్పుకునే మీరు కుంభమేళాకు ఎలా వెళ్లారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించారు ప్రకాష్ రాజ్.. అది ఫేక్ ఫోటో(Fake News Alert) అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజు... ఇలా చేయడం సిగ్గు చేటు అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
మహా కుంభమేళా కు భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒక్కరోజే 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేయగా ఇందుకు తగ్గట్టుగానే భక్తులు తరలివచ్చారు. మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Prakash Raj at Kumbh Mela.. he Clarify that it is a fake photo!
FAKE NEWS ALERT
the last resort of bigots and coward army of “Feku Maharaj” is to stoop down and spread FAKE NEWS.. even during theire Holy ceremony.. what a SHAME .. Complaint has been filed against the Jokers .. face the consequences #justasking pic.twitter.com/xpftHyrPoA
— Prakash Raj (@prakashraaj) January 28, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 10:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

