దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన Mi-17V-5 హెలికాప్టర్లు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan)లో తమ విధులకు బయలుదేరాయి.
గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic Day) ఆకాశం నుండి పుష్పవర్షంతో ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకం 🇮 గ్రూప్ కెప్టెన్ ఆలోక్ అహ్లావత్, సేనా పతాకం: వింగ్ కమాండర్ శైలేంద్ర సింగ్, నౌకాదళ పతాకం: వింగ్ కమాండర్ రోహిత్ తివారి, వాయుసేన పతాకం: వింగ్ కమాండర్ వినయ్ ఉన్నారు.
ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. ఈ సందర్భంగా త్రివిధ దళాల విన్యాసం అందరిని ఆకట్టుకోగా హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించారు. అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో
Republic Day celebrations flowers raining from the sky
Delhi: Mi-17V-5 helicopters of 129 Helicopter Unit take off for duty from Rashtrapati Bhavan.
🇮🇳 Republic Day celebrations started with flowers raining from the sky.
▪️ National Flag 🇮🇳 : Group Captain Alok Ahlawat.
▪️ Army Flag: Wing Commander Shailendra Singh.
▪️ Navy… pic.twitter.com/RNwW1Ei7yq
— Telangana Awaaz (@telanganaawaaz) January 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)