ఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలతో వ్యభిచారం, 12 మంది మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, జువైనల్ హోంకు తరలింపు

బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఒక వ్యక్తి ఎక్కాడు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడించాలని డిమాండ్‌ చేశాడు. దేశ రాజధానిలో గాలి, నీటి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.తాను టీచర్‌ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్‌, ఆ తర్వాత బీహార్‌కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే అతడు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)