సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రియురాలి తండ్రిపై ప్రియుడు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. కంట్లో నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. హైదరాబాద్ - సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి రేవంత్ ఆనంద్ (57) పై ప్రియుడు కాల్పులు జరిపాడు.
వివరాలలోకి వెతితే అంబర్పేట్ కి చెందిన బల్విందర్ సింగ్ (25) మన్వీత (23) ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.. ఇంట్లో తెలిసి అమ్మాయి తండ్రి, అమ్మాయిని ఈ మధ్యనే ఎవ్వరికి తెలియ కుండా అమెరికాకు పంపించాడు. విషయం తెలుసుకున్న బల్విందర్ సింగ్ ఈ విషయంపై అమ్మాయి తండ్రి రేవంత్ ఆనంద్ ( 57)తో ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగడంతో ఎయిర్ గన్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపిన బల్వీందర్ సింగ్.. దీంతో రేవంత్ ఆనంద్ కంటిలో నుండి దూసుకెళ్లిన బుల్లెట్. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. పోలీసుల అదుపులో నిందితుడు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Here's News
Dramatic Air Gun Assault in
Hyderabad: Father Shot in Eye Amid Daughter's Relationship Row
In n Hyderabad, a 57-year-old man was gravely injured following an air gun attack by his daughter's boyfriend. The confrontation erupted at a residential complex in Venkateswara Colony,… pic.twitter.com/fS9vZg75J9
— Sudhakar Udumula (@sudhakarudumula) November 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)