ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం మూడో రోజు కూడా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్‌ ఇండియా విమానం ముంబైలో ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఇక రేపు( ఆదివారం) అర్ధరాత్రి 2.30 గంటలకు రెండో విమానం ఢిల్లీ చేరుకోనుంది. ముంబై ఎయిర్ పోర్టుకు సురక్షితంగా చేరుకున్న వారికి కేంద్ర మంత్రి పీయూశ్ గోయ‌ల్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా భార‌తీయ విద్యార్థులు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)