బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శాసనసభాపక్షం సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఆమెను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమె గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయారు. దాదాపు చాలా సంవత్సరాల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ సామాజిక సమీకరణల మధ్య బినోయ్ సామాజిక వర్గానికి చెందిన రేఖ గుప్తాను బీజేపీ పెద్దలు సీఎంగా ప్రకటించారు.
Rekha Gupta To be Next Delhi CM, Announces BJP Party
Delhi BJP Legislative Party elects Rekha Gupta as its leader. She is set to become the Chief Minister of Delhi. pic.twitter.com/VdDWffxXLa
— ANI (@ANI) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)