Puri, April 29: స్వలింగ వివాహాల (Sam Sex Marriage) చట్టబద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ పూరీ శంకరాచార్య స్వామి (Puri Peeth Shankaracharya), గోవర్ధన పీఠాధిపతి అయిన నిశ్చలానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు. ఇవి యావత్ మానవాళికే కళంకమని అన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చినా దానిని అమోదించాల్సిన పని లేదని అన్నారు. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే, అలా ఇచ్చిన న్యాయమూర్తులను ప్రకృతి వదిలిపెట్టబోదని అన్నారు. శిక్షించి తీరుతుందని హెచ్చరించారు. అయినా, ఇలాంటి వ్యవహారాలు మతాధికారుల పరిధిలో ఉంటాయని, కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవని అన్నారు.
Same-sex marriage is a "blot on humankind" and there is no need to accept a #SupremeCourt judgment that legalises it, the Shankaracharya of the Puri Peeth said. #SameGenderMarriage https://t.co/MhSRHrB3kL
— The Telegraph (@ttindia) April 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)