టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తొలి హ్యట్రిక్ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది. ఇక ఆసీస్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. 2007లో బంగ్లాపైనే బ్రెట్‌లీ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఐర్లాండ్‌ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ (2021), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (2021), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (2021), యూఏఈ బౌలర్ కార్తిక్ మైయప్పన్ (2022), ఐర్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ జోష్ లిటిల్ (2022) ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)