ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవెన్‌ స్మిత్‌ (Steve Smith) వన్డే క్రికెట్‌ నుంచి తక్షణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌తో సెమీఫైనలే స్మిత్‌కు చివరి వన్డే. అతడు టెస్టులు, టీ20 క్రికెట్లో కొనసాగుతాడు. 35 ఏళ్ల స్మిత్‌ గాయపడ్డ కమిన్స్‌ స్థానంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం మ్యాచ్‌ ముగిసిన తర్వాత సహచరులకు అతడు తన రిటైర్మెంట్‌ విషయం చెప్పాడు.

వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన స్టీవ్ స్మిత్, ఊపిరి పీల్చుకున్న భారత్

‘‘వన్డేల్లో నా ప్రయాణం గొప్పగా సాగింది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. రెండు ప్రపంచకప్‌లు గెలవడం అన్నింటికన్నా హైలైట్‌’’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటనలో స్మిత్‌ పేర్కొన్నాడు.2015, 2023లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టులో స్మిత్‌ కీలక సభ్యుడు. 2015, 2021లో అతడు ‘వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు.170 మ్యాచ్‌ల్లో 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి. స్మిత్‌ వన్డేల్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు.

Steve Smith announces retirement from ODIs

 

View this post on Instagram

 

A post shared by Steve Smith (@steve_smith49)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)