చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత ఆరంభం మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ లో అక్ష‌ర్ ప‌టేల్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్సు మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి తంజిద్ హ‌స‌న్‌ను ఔట్ చేసిన అక్ష‌ర్‌.. ఆ త‌ర్వాత మూడో బంతికి ముష్‌ఫిక‌ర్ ర‌హీమ్‌ను ఔట్ చేశాడు.

అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్... చేజేతులారా క్యాచ్ వదిలేసిన రోహిత్..  నిరాశలో భారత బౌలర్

ఆ ఇద్ద‌రూ కీప‌ర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.అయితే నాలుగో బంతికి జ‌కీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ మిస్ చేశాడు. ఈజీగా వ‌చ్చిన ఆ క్యాచ్‌ను అత‌ను అందుకోలేక‌పోవడంతో అక్ష‌ర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తాజా స‌మాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ 10 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 39 ర‌న్స్ చేసింది. కేవ‌లం తంజిద్ హ‌స‌న్ మాత్ర‌మే 25 ర‌న్స్ స్కోర్ చేసి ఔట‌య్యాడు. ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు.

Indian Captain Drops Catch on Axar Patel's Hat-Trick Ball

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)