తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు. ఈ ఘటన అత్యంత విచారకరం. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై తీవ్ర ఆగ్రహం, వీడియో ఇదిగో..

మా హయాంలో వారం ముందే టోకెన్లు జారీ చేసేవాళ్లం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 10 రోజుల నుంచి నిద్రాహారాలు మాని శ్రమపడే వాళ్లమ‌ని చెప్పారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. చైర్మెన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కలిగించాయని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ ఘటనలో తమవైపు నుండి ఎలాంటి తప్పు లేదని... ఇది దైవ నిర్ణయం అంటూ టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడటం ఆందోళనకరమని అన్నారు. ఇది ముమ్మాటికీ అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

former TTD chairman YV Subba Reddy on Stampede in Tirupati

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)