హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ (BJP) కార్యాలయం వద్ద హైటెన్సన్ నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారి పరస్పరం కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చ ప్రయత్నం చేస్తున్నారు.

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం

Clash Between Congress and BJP Workers

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)