Sports
Argentina Win FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌ మరోసారి అర్జెంటీనా కైవసం, ఫుల్ కిక్కిచ్చిన ఫైనల్ మ్యాచ్, షూటవుట్‌తో దుమ్మురేపిన అర్జెంటీనా, మెస్సీకి విక్టరీతో ఘన వీడ్కోలు
VNSపెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (FIFA World Cup 2022) ఉత్కంఠగా సాగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది.
Lionel Messi World Record: ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌తో మెస్సీ అరుదైన రికార్డు, కెరీర్‌లో చివరి మ్యాచ్‌తోనే రికార్డు బద్దలు కొట్టిన ఫుట్‌బాల్ లెజెండ్‌
VNSఅర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ (Lionel Messi) మ‌రో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైన‌ల్‌తో (World Cup final) క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జ‌ర్మ‌నీకి చెందిన లోథ‌ర్ మ‌థాస్ రికార్డును బ్రేక్ చేశాడు.
India vs Bangladesh: బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం.. 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు
Rudraబంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.
Shardul-Mittali Marriage Date Out: ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్‌
Rudraటీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.
Kuldeep Test Record: అశ్విన్, కుంబ్లే రికార్డులను బద్దలుగొట్టి.. అతిపెద్ద రికార్డు సాధించిన కుల్దీప్ యాదవ్.. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు
Rudraబంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Most Searched Asians on Google 2022: ఆసియా అందాల తారగా కత్రినా కైఫ్, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022ని విడుదల చేసిన గూగుల్
Hazarath Reddyగూగుల్ విడుదల చేసిన 'మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022' జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టాప్ 5 లో నిలిచింది.ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆసియన్ల జాబితాలో, కత్రినా 4వ స్థానాన్ని పొందగా, అలియా భట్ 5వ స్థానంలో ఉంది.
IND vs BAN 1st Test 2022: వీడియో ఇదే.. రెండు హెల్మెట్‌లను తాకిన బంతి, భారత్‌కు అయిదు పెనాల్టీ పరుగులు
Hazarath Reddyరవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ భాగస్వామ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన 1వ టెస్టు 1వ ఇన్నింగ్స్‌లో 2వ రోజు భారత్ మొత్తంలో కొన్ని విలువైన పరుగులను జోడించింది. ఆ భాగస్వామ్యం మధ్య, థర్డ్ మ్యాన్ ఏరియా నుండి యాసిర్ అలీ వేసిన త్రో వికెట్ కీపర్ వెనుక ఉంచిన రెండు హెల్మెట్‌లను తాకడంతో భారత్‌కు పెనాల్టీ పరుగులు లభించాయి. ఆ క్రమంలో అంపైర్ భారత్ స్కోరుకు ఐదు పరుగులు జోడించాడు
Sania Mirza-Shoaib Malik: సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల రూమర్స్‌లో మరో ట్వీస్ట్, నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను అంటూ బయోలో రాసుకొచ్చిన మాజీ పాక్ క్రికెటర్
Hazarath Reddyసోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో ‘నేను సూపర్‌ వుమన్‌ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్‌ బయోకు సంబంధించి పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.
FIFA World Cup 2022: షాకింగ్ వీడియో, ఫ్రాన్స్‌ చేతిలో మొరాకో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ దేశ అభిమానులు, బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించిన 100 మంది ఫ్యాన్స్
Hazarath Reddyఫిఫా ప్రపంచకప్-2022లో ఖతర్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌..మొరాకోను చిత్తు చేసి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. నాకౌట్‌ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్‌ టీమ్‌కు బిగ్ షాక్, టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కేన్ విలియమ్సన్, జస్ట్ టీమ్ మెంబర్‌గా ఉంటానంటూ ప్రకటన, కొత్త కెప్టెన్‌ ఎవరంటే?
VNSఆయన నాయకత్వంలో కివీస్‌ జట్టు 38 మ్యాచ్‌లు ఆడగా.. 22 టెస్టుల్లో జట్టు విజయం సాధించింది. మరో 8 డ్రా కాగా, 10 మ్యాచుల్లో టీమ్‌ ఓడిపోయింది. విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లు ఆడగా 193 సార్లు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
FIFA WC 2022: ఫిఫాలో మరోసారి ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, రెండో సెమీస్‌లో మొరాకోను చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్, ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌కోసం సర్వం సిద్ధం
VNSఫిఫా ప్రపంచ కప్‌-2022లో మూడో స్థానం కోసం శనివారం మొరాకో-క్రొయేషియా తలపడతాయి. కాగా, మొరాకోపై గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించడంతో ఫ్రాన్స్ లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది.
India Women vs Australia Women 3rd T20: మూడవ టీ20లో ఆస్ట్రేలియా మహిళా జట్టు చేతిలో టీమిండియా మహిళా జట్టు ఓటమి, 5 టీ 20 మ్యాచుల సిరీస్ లో 2-1తో రాణించిన ఆసీస్..
kanhaబుధవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 21 పరుగుల తేడాతో ఓడిపోయారు.
Lionel Messi Goal Video: మెస్సి పెనాల్టీ గోల్ వీడియో ఇదే, ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన అర్జెంటీనా కెప్టెన్
Hazarath Reddyక్రొయేషియాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుత‌మైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మ‌లిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీప‌ర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచ‌నా వేసినా.. మెస్సీ ప‌వ‌ర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది.
Lionel Messi Retirement: లియోనల్‌ మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన, డిసెంబర్ 18న జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తన చివరి మ్యాచ్ అని వెల్లడి
Hazarath Reddyఅర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. ఖతర్‌ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అర్జెంటీనా తరపున చివరిదని స్పష్టం చేశాడు.
Ranji Trophy 2022-23: సెంచరీతో కదం తొక్కిన సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్
Hazarath Reddyభారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది (Arjun Tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
Udhayanidhi Stalin: క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి
Hazarath Reddyతమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు.
PAK vs ENG 2nd Test: వైరల్ వీడియో, అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను అలా..
Hazarath Reddyఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ పరాజయంతో పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ వేసిన బాల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు దిమ్మతిరిగిపోయేలా చేసింది.
Virat Kohli Fans in Pakistan: కోహ్లీ..ఓ సారి పాకిస్తాన్‌కు వచ్చి ఆడు ప్లీజ్, ప్లకార్డులను పట్టుకుని అభిమానం చాటుకున్న దాయాది దేశం ఫ్యాన్స్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyవచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని పాక్ అభిమానులు ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్‌ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్‌ ఆడాలని మొరపెట్టుకున్నారు.
IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 405 మంది ప్లేయ‌ర్లు, వీరిలో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు, డిసెంబ‌ర్ 23వ తేదీన కొచ్చిలో మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వేలం పాట
Hazarath Reddyస్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆట‌గాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాల‌క మండలి మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. 405 మంది ప్లేయ‌ర్లు వేలంలో నిలిచారు. వీళ్ల‌లో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆట‌గాళ్లు పేర్లు న‌మోదుచేసుకున్నారు.
Bangla Test Series: బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ.. ఈ నెల 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్
Rudraఈ నెల 14 నుంచి టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ జట్టులో మార్పులు చేసింది.