Sports

U-19 Asia Cup: అండర్ 19 ఆసియా కప్ భారత్ కైవసం, శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలం, సత్తా చాటిన యువ టీమిండియా

Krishna

అండర్ 19 ఆసియా కప్ పైనల్లో భారత యువ టీమిండియా శ్రీలంక జట్టును మట్టి కరిపించి ఆసియా కప్ కైవసం చేసుకుంది. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.

David Warner Dubs Pushpa Dialogue: పుష్ప తెలుగు డైలాగ్‌తో షాకిచ్చిన డేవిడ్ వార్నర్, పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ వీడియో, డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ రిప్లయి

Hazarath Reddy

డేవిడ్ వార్నర్.. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.

Ravichandran Ashwin Dance video: భారత క్రికెట్ ఆటగాళ్లు డ్యాన్స్‌తో విరగదీశారు, తొలి టెస్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్ క్రికెటర్స్ అశ్విన్ చెతేశ్వర్ పుజారా, మహ్మద్ సిరాజ్

Hazarath Reddy

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్‌ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు.

IND vs SA 1st Test: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం

Krishna

సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

IND vs SA 1st Test 2021: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్, 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు

Hazarath Reddy

సెంచురియన్ లో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

IND vs SA 1st Test 2021: సఫారీలకు చుక్కలు చూపించిన షమీ, తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా, భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం

Hazarath Reddy

పేసర్‌ మొహమ్మద్‌ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో (IND vs SA 1st Test 2021) భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో సఫారీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది.

India vs South Africa 1st Test 2021: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయిన భారత్, మూడో రోజు 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయిన టీం ఇండియా

Hazarath Reddy

దక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య తొలి టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. మూడో రోజు తొలి సెషన్ లోపే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులకు (Team India all out for 327 runs ) ఆలౌట్ అయింది. నిన్న వర్షం కారణంగా రెండో రోజు ఆట (India vs South Africa 1st Test 2021) రద్దయిన సంగతి విదితమే.

Irfan Pathan Blessed With A Baby Boy: రెండోసారి తండ్రి అయిన ఇర్ఫాన్ పఠాన్, డిసెంబర్ 28న రెండవ బాబుకు జన్మనిచ్చిన భార్య సఫా, సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టిన దంపతులు

Hazarath Reddy

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన (Former Indian cricketer Irfan Pathan) ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అతని భార్య డిసెంబర్ 28న వారి రెండవ కుమారుడికి జన్మనిచ్చింది. అతను బాబుకి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టాడు.

Advertisement

Sourav Ganguly Covid: రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక సౌరవ్‌ గంగూలీకి కరోనా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ వర్గాలు

Hazarath Reddy

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు.

South Africa vs India, 1st Test, Day 1: తొలి టెస్టులో అదరగొట్టిన కేఎల్ రాహుల్, సెంచరీతో అద్భుతమైన ఓపెనింగ్, ఇంకా క్రీజులోనే సెంచరీ మ్యాన్

Naresh. VNS

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో(South Africa vs India) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టాడు. తొలి రోజు మ్యాచ్‌లో సెంచరీ(KL Rahul Century ) సాధించాడు. మొత్తం 218 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఏడో సెంచరీ. 99 పరుగులు వద్ద మహారాజ్ బౌలింగులో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు.

Harbhajan Singh Retires: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్, త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లుగా వార్తలు, పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతారా..

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొన్నాడు. తనకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నాను, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తన సందేశాన్ని తెలిపాడు.

Latest ICC Rankings: ఏడవ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ, టాప్‌లో ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌, రెండవ స్థానంలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌, ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా

Hazarath Reddy

ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌ టాప్ లో నిలిచాడు.

Advertisement

PAK Cricketer Yasir Shah: ఆ క్రికెటర్ కామాంధుడు, మైన‌ర్ల‌ను రేప్ చేసి వీడియోలు తీస్తాడు, పాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై ఫిర్యాదు చేసిన యువతి, మైన‌ర్ బాలిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

పాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై మైన‌ర్ బాలిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. క్రికెట‌ర్ యాసిర్ షా స్నేహితుడు ఫ‌ర్హ‌న్ త‌న‌ను గ‌న్‌పాయింట్‌లో బెదిరించి రేప్ చేశాడ‌ని, దాన్ని వీడియో తీసిన‌ట్లు కూడా ఆ బాలిక త‌న ఎఫ్ఐఆర్‌లో తెలిపింది.

Kidambi Srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి, చేజారిన స్వర్ణం, రజతంతో సరి, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

Krishna

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు.

BWF World Championship 2021: వరల్డ్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధుకు నిరాశ, క్వార్టర్స్‌ లోనే వెనుదిరిగిన డిఫెండింగ్ చాంపియన్, తైవాన్ ప్లేయర్ చేతిలో ఓటమి

Naresh. VNS

బీడబ్లూఎప్ వరల్డ్ చాంపియన్ షిప్‌(BWF World Championship) నుంచి పీవీ సింధు(PV Sindhu) నిష్క్రమించింది. స్పెయిన్‌(Spain)లో జరుగుతున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ సింధు క్వార్టర్స్‌(quarter final) లో తైవాన్ క్రీడాకారిణి తై జూ యింగ్(Tai Tzu-ying ) చేతిలో 21-17, 21-13 స్కోర్ తేడాతో ఓట‌మి పాలైంది.

Konica Layak Dies : భారత క్రీడా రంగంలో మరో విషాదం, జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య, షూటింగ్ క్రీడలో రాణించలేకపోతున్నానని అందుకు సూసైడ్ చేసుకుంటున్నానని లేఖ

Hazarath Reddy

దేశ క్రీడా రంగంలో మరో విషాదం నెలకొంది. జాతీయ స్థాయి యువ షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య (Konica Layak, National shooter, Dies by Suicide) చేసుకుంది. కోల్ కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని (Konica Layak Dies by Suicide) ఉన్న స్థితిలో ఆమెను గుర్తించారు.

Advertisement

Virat Kohli-BCCI Rift: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన కపిల్ దేవ్, జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది, వారు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపిన మాజీ కెప్టెన్ 

Hazarath Reddy

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. బీసీసీఐపై చేసిన వాఖ్యలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ (BCCI) తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Kohli vs Rohit Alleged Rift: చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం చేయకండి, ట్విట్టర్ వేదికగా గంగూలిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

Hazarath Reddy

BCCI అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తీరును టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. మీరు చెత్త రాజకీయాలు మానుకొని జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు ( Fans slam BCCI President Sourav Ganguly) చేస్తున్నారు

Virat vs Rohit Alleged Rift: ఆట తర్వాతనే ఆటగాళ్లు, బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి, దానికి కట్టుబడి ఉండాల్సిందే, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్ల(విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ) వ్యవహారంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట కంటే ఆటగాళ్లు గొప్పవాళ్లేమీ కాదంటూ రోహిత్‌, విరాట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Virat Kohli Press Conference: వ‌న్డేల‌కు కెప్టెన్‌గా కొన‌సాగ‌రాదని 5 గురు సెలెక్ట‌ర్లు నిర్ణయించారు, వ‌న్డేల‌కు తానేమీ రెస్ట్ కోర‌లేదు, మీడియాతో విరాట్ కోహ్లీ

Hazarath Reddy

ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు త‌నకు మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇవాళ ఆయ‌న ముంబైలో మీడియాతో (Virat Kohli Press Conference) మాట్లాడుతూ..టెస్టు జట్టును ఎంపిక చేసుకోవ‌డానికి కేవ‌లం గంట‌న్న‌ర ముందు మాత్ర‌మే త‌న‌ను బీసీసీఐ కాంటాక్ట్ చేసిన‌ట్లు కోహ్లీ ( Virat Kohli) చెప్పాడు.

Advertisement
Advertisement