క్రీడలు
U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది, జనవరి 19న వెస్టిండీస్‌తో వరల్డ్ కప్ వేటను ప్రారంభించనున్న భారత్
Vikas Mరెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
Vinesh Phogat Disqualification: విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత, వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై 24 పేజీల తీర్పును వెల్లడించిన కాస్
Vikas Mఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రజతం దక్కని విషయం విదితమే. ఏ కారణం చెప్పకుండానే వినేశ్ ఫోగొట్‌కు పతకం నిరాకరించడాన్ని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాస్ సోమవారం 24 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపులు ఉండవని కాస్ చెప్పింది.
Vinesh Phogat Mother: వినేశ్ ఫోగట్ ఎప్పుడూ మాకు ఛాంపియనే, ప్రజల హృదయాలను గెలచుకుందన్న తల్లి ప్రేమలత
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి అధిక బరువు కారణంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్ ఫొగట్ తల్లి ప్రేమలత స్పందించారు. వినేశ్ ఎప్పటికి మాకు ఛాంపియనే, ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చారన్నారు. బంగారం పతకం సాధించకపోయినా అంతకంటే ఎక్కువ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు.
Manu Bhaker: ఒలింపిక్స్ అలసట నుంచి రిలాక్స్ అవుతున్న మనూ భాకర్, షూటింగ్ పక్కన పెట్టి ఏం చేస్తుందో చూడండి
VNSపారిస్ ఒలింపిక్స్ షూటర్ మను భాకర్ (Manu Bhaker) కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించాయి. విశ్వ క్రీడల్లో రెండు కాంస్య పతకాల(Bronze Medals)తో చరిత్ర సృష్టించిన ఆమె యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.
PM Modi Meets Medal Winners: ఒలింపిక్ విజేతలను కలిసిన ప్రధాని మోదీ వీడియో ఇదిగో, ఇదే పిస్టల్‌తో పతకం తెచ్చానంటూ ప్రధాని మోదీతో మను బాకర్ ముచ్చట్లు
Vikas Mభారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒలింపిక్ విజేతలను కలిశారు. ఒలింపిక్స్‌లో కంచుమోత మోగించిన మను భాకర్, స్వప్నిల్ కుశాలె వరుసగా రెండో కాంస్యం గెలుపొందిన హాకీ ఆటగాళ్లు, యువరెజ్లర్ అమన్ షెహ్రావత్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Virat Kohli in London: వీడియో ఇదిగో, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ, బ్లాక్ డ్రెస్ వేసుకుని రోడ్డు దాటుతున్న వీడియో వైరల్
Vikas Mటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
CAS Dismissed Vinesh Phogat Petition: వినేశ్ ఫోగట్ పిటిషన్‌ను కొట్టేసిన కాస్ కోర్టు, తీవ్ర నిరాశలో వినేశ్, రజత పతకంపై ఆశలు ఆవిరి
Arun Charagondaభారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరినా అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసింది వినేశ్. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను దాఖలు చేయగా కాస్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పతకంపై వినేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది.
Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Vikas Mభారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.
Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్, రెండవ స్థానంలో రోహిత్ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్
Vikas Mటీమ్‌ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.
Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జే షా, గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌలర్
Vikas Mటీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్‌కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.
Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..
Vikas Mచాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.
CAS Verdict On Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు తప్పని నిరీక్షణ, తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసిన CAS, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Arun Charagondaఅధిక బరువు కారణంగా పారిస్ ఒలింపింక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగం నుండ డిస్ క్వాలిఫై అయింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించగా మరోసారి నిరీక్షణ తప్పలేదు. తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసింది కాస్.
Arshad Nadeem: అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు
Vikas Mఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్‌పై కాసుల వర్షం కురుస్తోంది.
Paris Olympics 2024 : 6 పతకాలతో 71వ స్థానంలో భారత్, టాప్ ప్లేస్‌లో అగ్రరాజ్యం అమెరికా, చైనాకు ఎన్ని పతకాలంటే?
Arun Charagondaవిశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్ 2024 ముగిసింది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఈసారి చైనాను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 1 బంగారు,2 కాంస్య, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజత,నాలుగు కాంస్యం,2016 రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం,ఒక కాంస్యం
Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)
Rudraపారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Romania Wrestler Injured: పారిస్ ఒలింపిక్స్ లో విషాదం, అమాంతం ఎత్తి పడేసిన ప్రత్యర్ధి, మహిళా రెజ్లర్ విరిగిపోయిందా? ఆస్పత్రిలో సీరియస్ కండిషన్ లో రెజ్లర్
VNSఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలనే ఓ రెజ్లర్ (Wreaslig) కల చెదిరింది. ప్రత్యర్థి అమాంతం ఎత్తి పడేయంతో ఊహించని విధంగా ఆమె గాయపడింది. మహిళల ఫ్రీ స్టయిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ కటలినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాలపాలైంది
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు
Rudraపారిస్ ఒలింపిక్స్ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు
Manu Bhaker Meets Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన మను భాకర్, కోచ్ జస్పల్ రాణాతో కలిసి రాహుల్‌తో భేటీ, అభినందించిన ప్రతిపక్ష నేత
Arun Charagondaపారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో కోచ్ జస్పల్ రానాతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా మను భాకర్‌ను అభినందించారు రాహుల్
Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.