Sports
Anthony Ammirati: గంట నటిస్తే రెండున్నర లక్షల డాలర్లు, పురుషాంగం దెబ్బకి ఒలింపిక్స్‌లో డిస్ క్వాలిఫై అయిన ఫ్రెంచ్ పోల్‌వాల్ట్ అథ్లెట్‌కు పోర్న్ సైట్ భారీ ఆఫర్
Hazarath Reddyఫ్రాన్స్ పోల్‌వాల్ట్(pole vaulter) ఆటగాడు ఆంథోనీ అమ్మిరాటికి .. ఓ పోర్న్ సైట్ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.ఒకవేళ అమ్మిరాటి పోర్న్ సైట్‌లో నటిస్తే, అతనికి రెండున్నర లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు కామ్‌సోడా వెబ్‌సైట్ ప్రకటన చేసింది.వెబ్‌కామ్ షోకు 60 నిమిషాల సమయం కేటాయిస్తే, రెండున్నర లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు కామ్‌సోడా సీఈవో డార్ని పార్కర్ తెలిపారు.
Vinesh Phogat Disqualified: పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
Paris Olympics 2024: గెలిచినా ఓడినా పతకమే, వినేశ్ అనర్హత వేటు వెనుక అసలేం జరిగింది, మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించిన ఐఓఏ
Hazarath Reddyఫైనల్లో గెలిచినా ఓడినా భారత్‌కు పతకం వచ్చేది. కానీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది.
Vinesh Phogat Hospitalised: అనర్హత వేటు తర్వాత ఆస్పత్రిలో చేరిన వినేశ్ ఫోగట్, డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థత
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలు అయిన వినేష్ ఫోగట్ పారిస్‌లో డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలయింది.
Vinesh Phogat Disqualified: అక్కడ ఏదో జరిగింది, 50-100 గ్రాముల అధిక బరువు ఉంటే అనుమతిస్తారు, తదుపరి ఒలింపిక్స్‌కు వినేష్‌ను సిద్ధం చేస్తానని తెలిపిన ఫోగట్ మేనమామ
Hazarath Reddyనేను చెప్పడానికి ఏమీ లేదు. దేశం మొత్తం బంగారం ఆశించింది... నియమాలు ఉన్నాయి కానీ ఒక రెజ్లర్ 50-100 గ్రాముల అధిక బరువు కలిగి ఉంటే, వారు సాధారణంగా అనుమతించబడతారు. ఆడండి, నిరాశ చెందవద్దని నేను దేశ ప్రజలను అడుగుతాను
Vinesh Phogat Disqualified: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై స్పందించిన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్, ఏమన్నారంటే..
Hazarath ReddyParis Olympics 2024 నుండి భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై, BJP MP కరణ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఇది దేశానికి పూర్తిగా నష్టం. ఫెడరేషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏమి చేయగలదో చూస్తుంది" అని అన్నారు
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్, అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు, స్వర్ణ పతక ఆశలు ఆవిరి
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం
Vinesh Phogat Disqualified: ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు భారీ షాక్, అధిక బరువు కారణంగా పోటీకి అనర్హురాలుగా ప్రకటించిన అధికారులు, యావత్ భారతీయుల స్వర్ణ పతక ఆశలు ఆవిరి
Hazarath Reddyభారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం. రాత్రంతా బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే ఎక్కువ కొన్ని గ్రాముల బరువుతో ఉంది.
Paris Olympics 2024: వీడియో ఇదిగో, అమ్మా..నేను బంగారు పతకంతో తిరిగివస్తా, తల్లికి మాట ఇచ్చిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్
Hazarath Reddyస్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది.
Paris Olympics 2024: గతేదాడి జరిగిన అవమానాన్ని పంటికింద బిగపట్టి దేశం కోసం అద్భుత ప్రదర్శన, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
Hazarath Reddyభారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అద్భుత ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గతేడాది దేశ ఆమె అనుభవించిన తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది
Paris Olympics 2024: రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker) భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది.
Anthony Ammirati: వీడియో ఇదిగో, పురుషాంగం కర్రకు తాకడంతో హైజంప్‌లో ఫెయిల్, ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ నుంచి నిష్క్రమించిన పోల్ వాల్ట్ ఆటగాడు ఆంథోనీ అమిరాతి
Hazarath Reddyపారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయిన సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు
Neeraj Chopra 89.34 M Throw Video: నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరిన వీడియో ఇదిగో, ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత స్టార్
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ (గ్రూప్ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.
Graham Thorpe Dies: తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు
Vikas Mఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ తరఫున ఆడిన థోర్ప్.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు.
Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?
Vikas Mబంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న హింస ప్రపంచ క్రికెట్‌పై పడనుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరో రెండు నెలల్లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెలకొంది.
Vinod Kambli Viral Video: ఓ సచిన్.. నీ స్నేహితుడిని చూశావా, నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ వీడియో వైరల్, సాయం చేయాలంటూ టెండూల్కర్‌కి ట్యాగ్ చేస్తున్న అభిమానులు
Vikas Mమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా వెలుగొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.
Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.
Novak Djokovic Wins Olympic Gold: ఒలింపిక్స్ లో కల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడల్ సాధించిన జొకోవిచ్
VNSమాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తన కల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు పతకాన్ని Gold) కొల్లగొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకో ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పట్టేశాడు.
Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్‌లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్‌లో సెమీస్ ఛాన్స్ మిస్
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
Paris Olympics: మను బాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్, 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం, రెండు కాంస్యాలతో బాకర్ రికార్డు
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకుంది భారత షూటర్ మనూ భాకర్. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మనూ, హంగేరియన్ షూటర్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగగా హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించే అవకాశాన్ని మనూ తృటిలో మిస్సైంది.