క్రీడలు
Virat Kohli: చిన్నప్పటి నుండి చదివే పేపర్ కూడా ఫేక్ న్యూస్ రాస్తోంది, ఇన్ స్టా వేదికగా ప్రముఖ పత్రిక కథనాన్ని ట్వీట్ చేసిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మహారాష్ట్ర అలీబాగ్‌ (Alibagh)లో ఉన్న వారి ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నారంటూ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా కథనం రాసింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ కోహ్లీ ఇన్ స్టా వేదికగా స్పందించాడు
Rishabh Pant Comeback: రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీకి సిద్ధం, జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులోకి రానున్న పంత్, త్వరలోనే ఫిట్‌నెస్‌ టెస్ట్
VNSటీమ్ఇండియా (Team India)అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) అతి త్వ‌ర‌లోనే గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌నున్నాడు అనే వార్త ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాదు అత‌డి రీ ఎంట్రీకి సైతం ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్లు ఆ వార్త‌ల సారాంశం. ఈ విష‌యాన్ని ఓ బీసీసీఐ(BCCI)కి చెందిన ఉన్న‌తాధి కారి వెల్ల‌డించాడ‌ట‌.
Red Card In Cricket: ఇకపై క్రికెట్‌లో కొత్త రూల్స్‌, స్లో ఓవర్ రేట్‌కు శిక్షల కోసం రూల్స్‌ మార్పు, రెడ్‌కార్డ్ ప్రవేశపెట్టిన కరీబియన్‌ ప్రీమియర్ లీగ్
VNSక్రికెట్‌లో ఫుట్‌బాల్ త‌ర‌హాలో రెడ్ కార్డ్ (Red card )నిబంధ‌న‌ను తీసుకువ‌స్తున్నారు. ఒక జ‌ట్టు నిర్ణీత స‌మ‌యంలోగా 20వ ఓవ‌ర్‌ను వేయ‌క‌పోతే 11 మంది ఆట‌గాళ్ల‌లోంచి ఒక ప్లేయ‌ర్ మైదానం వీడి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు.. స్లో ఓవ‌ర్ రేటు(slow over rate)ను 18 ఓవ‌ర్‌ను నుంచి కౌంట్ చేస్తూ ఆ ఓవ‌ర్ నుంచే శిక్ష‌లు విధించేలా కొత్త రూల్స్‌ను తెస్తున్నారు.
Navjot Singh Sidhu: క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ భార్య న‌వ‌జ్యోత్ కౌర్, ఆమెకు భోజ‌నం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసిన మాజీ క్రికెట‌ర్‌
Hazarath Reddyమాజీ క్రికెట‌ర్‌ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ భార్య న‌వ‌జ్యోత్ కౌర్ క్యాన్స‌ర్‌తో పోరాడుతోంది. తాజాగా బెడ్‌పై రెస్టు తీసుకుంటున్న ఆమెకు భోజ‌నం తినిపిస్తున్న ఫోటోను సిద్దూ షేర్ చేశారు. అయిదోసారి కీమో సెష‌న్‌కు త‌న భార్య హాజ‌రైన‌ట్లు సిద్దూ తెలిపారు. త్వ‌ర‌గా కోలుకునేందుకు ఆమెను మ‌నాలీ తీసుకువెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.
World Cup: వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చిన ఐసీసీ.. దాయాదుల పోటీ అక్టోబరు 15 నుంచి 14వ తేదీ మార్పు
Rudraఅక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. భారత్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే, ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో ఐసీసీ మార్పులు చేసింది. 9 మ్యాచ్ ల తేదీలు, ప్రారంభ సమయాలను సవరించింది.
Shubman Gill: ఈ చెత్త బ్యాటింగ్‌తో ఇండియా గెలుస్తుందా శుభమాన్ గిల్‌, దారుణంగా ట్రోలో చేస్తున్న క్రికెట్ అభిమానులు,అతన్ని పక్కన బెట్టి రుతురాజ్‌ను తీసుకోవాలని సూచన
Hazarath Reddyఅంతర్జాతీయ స్థాయిలో దారుణంగా విఫలం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్‌కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్‌-2023 తర్వాత గిల్‌ గణాంకాలను చూపిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.
Pakistan Squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఆడబోయే పాకిస్తాన్ జట్టు ఇదిగో, 18 మంది సభ్యుల జట్టును ప్రకటించిన పీసీబీ
Hazarath Reddyపాకిస్తాన్ క్రికెట్ జట్టు రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, హై-వోల్టేజ్ ఆసియా కప్ 2023 కోసం వారి జట్టును ప్రకటించింది. ఈ రెండు అసైన్‌మెంట్‌లు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సన్నాహకంగా చాలా ముఖ్యమైనవి. జట్టులో కొత్త చేరికలు ఉన్నాయి. ఫహీమ్ అష్రఫ్, తయ్యబ్ తాహిర్ ఆసియా కప్‌కు తిరిగి వచ్చారు. సౌద్ షకీల్ ఆఫ్ఘనిస్తాన్ ODI సిరీస్ కోసం జట్టులో ఉన్నారు
ICC World Cup 2023 New Schedule Released: భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు, భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు
Hazarath Reddyభారత్‌ వేదికగా ఈ ఏడాది (2023) అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 9) అధికారికంగా ప్రకటించింది.
National Anti-Doping Agency Test: డోప్ శాంపిల్స్ ఎక్కువ సార్లు ఇచ్చిన క్రికెటర్‌గా రవీంద్ర జడేజా, జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ టెస్ట్ తాజా వివరాలు ఇవిగో..
Hazarath Reddyనేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) విడుదల చేసిన డేటా ప్రకారం స్టార్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది జనవరి, మే మధ్య మూడుసార్లు డోప్ శాంపిల్స్ ఇచ్చాడు.
Latest ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ఫైవ్‌లోకి దూసుకువచ్చిన శుభ్‌మాన్ గిల్, టాప్ టెన్‌లోకి ప్రవేశించిన కుల్దీప్ యాదవ్, నంబర్ వన్ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్
Hazarath Reddyభారత స్టార్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ICC ODI ప్లేయర్ ర్యాంకింగ్స్ జాబితాలో కొత్త కెరీర్-హై రేటింగ్‌లతో రివార్డ్‌ను పొందారు.గిల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదవ స్థానానికి చేరుకున్నాడు.
ICC World Cup 2023 : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్ అక్టోబర్ 14కు మార్పు, రీ షెడ్యూల్ అయిన మ్యాచుల లిస్టు ఇదే..
kanhaICC సవరించిన ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఇప్పుడు అక్టోబర్ 14న జరగనుంది. మరో 8 మ్యాచ్‌లలో కూడా మార్పులను చూడవచ్చు. ఫలితంగా, ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లండ్ మ్యాచ్ శనివారం, 14 అక్టోబర్ నుండి 15 అక్టోబర్ నాటికి షిఫ్ట్ అవుతోంది.
Australia Squad For World Cup 2023: స్టార్ ఆటగాడికి షాకిచ్చిన ఆస్ట్రేలియా, వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన కంగారూల స్వ్కాడ్ ఇదే..
Hazarath Reddyభారత్‌ లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టు వివరాలను ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ(ప్రాథమిక) జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారధ్యం వహించనుండగా స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌కు షాకిచ్చింది.
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరీ, బ్రియాన్ లారా స్థానంలో నియామకం
Hazarath Reddyఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డేనియల్ వెట్టోరీ ఎంపికయ్యాడు. వెట్టోరి గతంలో 2014 నుండి 2018 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.
Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..
Hazarath Reddyముంబై రంజీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అత‌ని వివాహ‌మైంది. స‌ర్ఫ‌రాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.
India vs Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ రీషెడ్యూల్, కొత్త తేదీ ఎప్పుడంటే..?
kanhaఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ODI ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో నవరాత్రి పండుగ కారణంగా భారత్-పాకిస్థాన్ సహా 6 మ్యాచ్‌లు రీషెడ్యూల్ కానున్నాయి.
Captains with Most Trophies: దటీజ్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు, తరువాత స్థానంలో రోహిత్ శర్మ
Hazarath Reddyఅత్య‌ధిక ట్రోఫీల‌ను ముద్దాడిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలలో పాటు 2007లో కెప్టెన్‌గా తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించి పెట్టాడు. ఆ త‌ర్వాత 2011లో ధోనీ సార‌థ్యంలోని మెన్ ఇన్ బ్లూ వన్డే ప్ర‌పంచ‌క‌ప్ అందుకుని చ‌రిత్ర సృష్టించింది.
Team India Smash 18-Year-Old Record: 18 ఏళ్ల తన రికార్డును తిరగరాసుకున్న టీమిండియా, మూడో వన్డేలో వెస్టిండీస్‌పై ఘన విజయంతో సరికొత్త చరిత్ర
Hazarath Reddyబ్రియన్‌ లారా స్టేడియంలో మూడో వన్డే సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.18 ఏళ్ల తన రికార్డును తిరగరాస్తూ.. జట్టులో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ సాధించకుండానే అత్యధిక స్కోరు నమోదు చేసింది.
Shubman Gill: పాకిస్తాన్ బ్యాటర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌, 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyవెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 6, 10, 29(నాటౌట్‌) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్‌ డిజిట్‌ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి.
Sanju Samson: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలా కష్టం, సంచలన వ్యాఖ్యలు చేసిన కీపర్ సంజూ శాంసన్
Hazarath Reddyకేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్ వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు. 41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.
India vs West Indies 3rd ODI: మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ భారత్ కైవసం
kanhaవెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఆతిథ్య జట్టు వెస్టిండీస్ ను 200 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 352 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఈ సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది