క్రికెట్
IPL 2022: ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో అతి పెద్ద సిక్స్, లివింగ్‌స్టోన్ భారీ సిక్స‌ర్‌ వీడియో ఇదిగో, 117 మీట‌ర్ల దూరం సిక్స‌ర్‌ను కొట్టిన పంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్
Hazarath Reddyపంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీ సిక్స‌ర్‌తో కేక పుట్టించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 117 మీట‌ర్ల దూరం సిక్స‌ర్‌ను కొట్టాడు. ఈ యేటి ఐపీఎల్ సీజ‌న్‌లోనే ఇది అతిపెద్ద సిక్స‌ర్. ష‌మీ వేసిన 16వ ఓవ‌ర్‌లో తొలి బంతినే లివింగ్‌స్టోన్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు.
IPL 2022: నిప్పులు చెరిగిన రబాడా, గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్, గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న పంజాబ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం
Hazarath Reddyఐదు వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings Thrash Gujarat Titans) షాకిచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌ను (Gujarat Titans) ఓడించింది.
IPL 2022: రింకూ సింగ్ మెరుపులు, నాలుగో విజయం నమోదు చేసుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం
Hazarath Reddyకోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది
IPL 2022: పోనీలే.. మరోసారి నన్ను అవుట్ చేయడానికి ట్రై చెయ్‌, చహల్‌కు హగ్‌ ఇచ్చి ఓదార్చిన సూర్యకుమార్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది. దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్‌ ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు
IPL 2022: పుంజుకున్న చెన్నై, 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం, మెరుపులు మెరిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌
Hazarath Reddyచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో (IPL 2022) మూడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
IPL 2022: ఐదో పరాజయం మూటగట్టుకున్న ఢిల్లీ, ఏడో విజయం నమోదు చేసిన లక్నో, 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం
Hazarath Reddyలక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో ఏడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. లక్నోకు వరుసగా ఇది మూడో విజయం కాగా.. ఢిల్లీ ఐదో పరాజయం మూటగట్టుకుంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గిన లక్నో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దగ్గరైంది.
IPL 2022, GT vs RCB Highlights: గుజరాత్ ఖాతాలో మరో సూపర్ విక్టరీ, పరాజయాలు కంటిన్యూ చేస్తూ ఆర్సీబీ, హాఫ్ సెంచరీతో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినప్పిటికీ దక్కని విక్టరీ, ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ బెర్త్ దాదాపు ఖారారు
Naresh. VNSఐపీఎల్ 2022 (IPL-2022) సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో (Gujarat Titans) మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది.
MS Dhoni Back as CSK Captain: మళ్లీ ధోనీ చేతికే సీఎస్కే పగ్గాలు, కెప్టెన్సీ వదులుకున్న రవీంద్ర జడేజా, వరుస వైఫల్యాలతో గుడ్ బై చెప్పిన ఆల్‌ రౌండర్
Naresh. VNSటీ20 లీగ్‌లో చెన్నై (Chennai)సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి (M.S. Dhoni) అప్పగించింది. 15వ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా (Ravindra Jadeja) నియమించింది.
IPL 2022: ఇదేమి సెలబ్రేషన్ సకారియా, ఫించ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆనందంలో ఏం చేశాడో చూడండి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్‌ వికెట్‌ పడగొట్టాడు. ఫించ్‌ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు.
IPL 2022: ఇదేమి క్యాచ్ బాబోయ్, స్పైడర్‌మ్యాన్‌లా నేల మీద పడబోతున్న బంతిని ఒడిసిపట్టుకున్న పంత్, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyవికెట్‌ కీపర్‌ పంత్‌ అద్భుతమైన 'లో' క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. వెంటనే క్యాచ్‌కు పంత్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి క్లియర్‌గా తాకినట్లు కనిపించింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.
IPL 2022: కుల్దీప్‌ దెబ్బకు 5వ ఓటమిని మూటగట్టుకున్న మాజీ చాంపియన్‌, వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Hazarath Reddyప్రత్యర్థి స్పిన్, పేస్‌ ధాటికి మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/14) ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలతో చెలరేగాడు.గురువారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపొందింది.
IPL 2022: ఏం బౌలింగ్ వేస్తున్నావ్, మైండ్ దొబ్బిందా.. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ మురళీధరన్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyగుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌కు వచ్చాడు.
IPL 2022: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు, 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌
Hazarath Reddyఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. లక్ష్య చేధన సమయంలో ప్రత్యర్థి జట్టుకు ఒక బౌలర్‌ తన కోటా ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే.
IPL 2022: రైజర్స్‌ జోరుకు బ్రేక్‌ వేసిన గుజరాత్, ఆఖర్లో రషీద్‌ ఖాన్ విధ్వంసంతో విజయం సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌, నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ అయినా తప్పని ఓటమి
Hazarath Reddyఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వరుస విజయాల జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేకులు వేసింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా.. ఆఖర్లో రషీద్‌ (11 బంతుల్లో 4 సిక్స్‌లతో 31 నాటౌట్‌) విధ్వంసంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ( Gujarat Titans Fourth Consecutive Victory) ఓడించింది.
IPL 2022: రియాన్ ప‌రాగ్‌తో కయ్యానికి దిగిన హ‌ర్షల్ ప‌టేల్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఇద్దరి ఫైట్ వీడియో
Hazarath Reddyఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్ అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కాగా రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ అఖ‌రి ఓవ‌ర్ వేసిన హ‌ర్షల్ ప‌టేల్ బౌలింగ్‌లో ప‌రాగ్‌ 18 పరుగులు ప‌ర‌గులు రాబాట్టాడు.అయితే హ‌ర్షల్ ప‌టేల్ వేసిన అఖ‌రి బంతికి ప‌రాగ్ భారీ సిక్స్ బాదాడు.
IPL 2022: మెరిసిన రాజస్థాన్‌, చతికిల పడిన బెంగుళూరు, 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైన రాయల్ ఛాలెంజర్స్
Hazarath Reddyగత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దెబ్బకు సీజన్‌లోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైన బెంగళూరు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.
IPL 2022: బోల్తాపడిన చెన్నై, నాలుగో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్, కీలక ఇన్నింగ్స్‌తో కింగ్స్‌కు విజయాన్ని అందించిన శిఖర్‌ ధవన్‌
Hazarath Reddyఐపీఎల్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. వాంఖడే మైదానంలో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం.
IPL 2022: కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో అతడిని ముద్దాడిన పాండ్యా, ముంబై- లక్నో మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
Hazarath Reddyముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు.
IPL 2022: లక్నోకు గట్టి షాక్, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించిన ఐపీఎల్‌ నిర్వాహకులు, మళ్లీ పునరావృతమైతే రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం
Hazarath Reddyముంబై ఇండియన్స్‌పై విజయంతో జోరు మీదున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు (Lucknow Super Giants) గట్టి షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు.. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి 24 లక్షల రూపాయల మేర ఫైన్‌ (KL Rahul Handed INR 24 Lakh Fine) విధించారు.