Cricket

IPL 2023: 24 ఫోర్లు, 33 సిక్స్‌లు, 444 పరుగులు, పరుగుల వరదలై పారిన ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్, 8 పరుగుల తేడాతో ధోనీ సేన ఘన విజయం

Hazarath Reddy

చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ లో పరుగుల వరద పారింది. మొత్తంగా 444 పరుగులు.. ఇరుజట్ల నుంచి 24 ఫోర్లు, 33 సిక్సర్లు. ఇలా బౌండరీల హోరుతో దద్దరిల్లిన మ్యాచ్ లో చెన్నై జట్టు మురిసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది.

Shivam Dube Six Video: 111 మీటర్ల భారీ సిక్సర్ బాదిన శివమ్‌ దూబే, ఆర్సీబీ బౌలర్లను కనికరం లేకుండా బాదిన చెన్నై బ్యాటర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దూబే బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు.

IPL 2023: వీడియో ఇదిగో, బద్దకంతో రనౌట్ మిస్, మెయిన్ ఆలీపై కోపంతో ఊగిపోయిన మిస్టర్ కూల్ ధోనీ, పేలవ ఫీల్డింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎస్‌కే కెప్టెన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. చెన్నై విసిరిన 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.

Ajinkya Rahane Catch Video: అజింక్య రహానే వావ్ అనిపించే క్యాచ్ వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేసిన రహానే

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్‌ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు.

Advertisement

RCB vs CSK, IPL 2023: చేజేతులా మ్యాచ్ ఓడిపోయిన బెంగుళూరు రాయల్ చాలెంజర్స్, విజయానికి 8 పరుగుల దూరంలో ధోనీ సేన ముందు చేతులెత్తేసిన కోహ్లీ సేన

kanha

IPL 2023: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై తరఫున తుషార్ దేశ్‌పాండే అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.

IPL 2023: ధోనీ కుంటుతూ బస్సు ఎక్కుతున్న వీడియో ఇదిగో, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మొదలైన ఆందోళన

Hazarath Reddy

సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడంటూ టీం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతవారం చేసిన సంగతి విదితమే.ఇలాంటి టైంలో ధోనీ కుంటుతూ బస్ ఎక్కుతున్న వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అభిమానుల్లో టెన్షన్ మరింత పెంచేసింది. ఇదే ఆ వీడియో..

IPL 2023: వీడియో ఇదిగో, కొడుకు ఆట చూసి భావోద్వేగానికి గురైన సచిన్, ముంబై తరపున ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్

Hazarath Reddy

సచిన్‌ టెండుల్కర్‌ తన కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని చూసి మురిసిపోయాడు. ఇంతవరకు అర్జున్‌ ఆటను నేరుగా చూసిందే లేదని.. తన జీవితంలో ఇదో సరికొత్త అనుభవమంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

IPL 2023: చెత్త బీహేవియర్‌తో జరిమానా కట్టిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు, ముంబై తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కి బీసీసీఐ భారీ షాక్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున 12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్‌ తలపడిన సంగతి విదితమే

Advertisement

IPL 2023: ఆడేది చెత్త ఆట..దానికి మళ్లీ నీ ఓవర్ యాక్షన్, రియాన్ పరాగ్‌పై మండిపడుతున్న ఆర్ఆర్ ఫ్యాన్స్, ఈ ఆటకు రూ. 3.80 కోట్లు అవసరమా అంటూ ట్రోల్

Hazarath Reddy

రాజస్తాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్న అతడిని తప్పించాలంటూ RR అభిమానులు రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు సూచిస్తున్నారు.

Ranji Trophy Prize Money: బీసీసీఐ గుడ్ న్యూస్, రూ. 2 కోట్ల నుంచి రూ. కోట్లకు పెరిగిన రంజీ ట్రోఫీ ప్రైజ్ మనీ, రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు

Hazarath Reddy

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వచ్చే సీజన్‌ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్‌మనీ రూ.2కోట్లుగా ఉండేది.ఇక రంజీ రన్నరప్‌కు రూ.3కోట్లు చెల్లించనున్నది

MI Vs KKR: కోల్‌కతాకు వరుస ఓటములు, ముంబై టీమ్‌లో చెలరేగిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సెంచరీ చేసినా గట్టెక్కించలేకపోయిన అయ్యర్

VNS

ఐపీఎల్‌-16లో ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) వరుసగా రెండో విజయం. ఢిల్లీపై చివరి బంతి వరకు పోరాడి గెలిచిన ముంబయి.. నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్‌ (104) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

LSG vs PBKS, IPL 2023: పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రజా, గెలిపించని కేఎల్‌ రాహుల్‌ కీలక ఇన్నింగ్స్, 2 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించిన పంజాబ్

Hazarath Reddy

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది.నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 2 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Advertisement

LSG vs PBKS: పంజాబ్ ప్లేయర్ సికిందర్ రజా అర్థశతకం, లక్నో టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు కీలక ఇన్నింగ్స్ ఆడిన రజా

VNS

లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో (LSG vs PBKS) పంజాబ్ ఆటగాడు సికిందర్ రజా (Sikandar Raza) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో టార్గెట్‌ ను రీచ్ అయ్యేందుకు చమటోడ్చుతున్నాడు. సికింద‌ర్ ర‌జా(50) హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 16వ‌ ఓవ‌ర్‌లో సింగిల్ తీసి యాభైకి చేరువ‌య్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో అత‌ను 50 ర‌న్స్ చేశాడు.

World Cup 2023: టీమిండియాకు గుడ్ న్యూస్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌ హెల్త్ అప్‌డేట్‌పై బీసీసీఐ నుంచి కీలక ప్రకటన

Hazarath Reddy

గాయసడిన టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌ గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్‌ అందించింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిపిన బీసీసీఐ.. ప్రస్తుతం ఈ స్పీడ్‌స్టర్‌ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది.

RCB vs DC, IPL 2023: వరుస ఓటములకు చెక్ పెట్టిన బెంగుళూరు, ఐదో ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న వార్నర్ సేన, 23 పరుగుల తేడాతో ఢిల్లీపై RCB ఘన విజయం

Hazarath Reddy

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస ఓట‌ముల‌కు గుడ్ బై చెప్పింది. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐపీఎల్‌-2023లో రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ ఐదో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

KKR Vs SRH: సెంచరీతో చెలరేగిన బ్రూక్స్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలుపు, రూ. 13 కోట్లకు న్యాయం చేశాడంటున్న ఫ్యాన్స్

VNS

ఐపీఎల్‌లో (IPL) బ్రూక్స్ కి ఇది తొలి శ‌త‌కం కాగా.. ఈ సీజ‌న్‌లో మొద‌టి సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా బ్రూక్ నిలిచాడు. కేవ‌లం 55 బంతుల్లోనే శ‌తకాన్ని అందుకున్నాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి. బ్రూక్ సాధించిన తాజా శ‌త‌కంతో క‌లిపి ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 76 సెంచ‌రీలు న‌మోదు అయ్యాయి

Advertisement

KKR Vs SRH, IPL-16: కోల్‌కతాపై చెలరేగిన బ్రూక్, సీజన్‌ లో తొలి సెంచరీతో హైదారాబాద్ భారీ స్కోర్, KKR ముందు భారీ లక్ష్యం

VNS

ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్(100) సెంచ‌రీ బాద‌డంతో హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది. 4 వికెట్ల న‌ష్టానికి 228 ర‌న్స్ కొట్టింది. కెప్టెన్ ఎయిడెన్ మ‌రక్రం(50) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఆఖ‌ర్లో అభిషేక్ శ‌ర్మ‌(32) సిక్సర్లతో హోరెత్తించాడు. ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి బ్రూక్‌ శ‌త‌కానికి చేరువ‌య్యాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో సెంచ‌రీ సాధించాడు.

IPL 2023: వీడియో ఇదిగో, అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ రికార్డు, 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన పంజాబ్ ఫాస్ట్ బౌలర్

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్‌ ఆడాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్‌ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్‌లో వందో వికెట్‌ సాధించాడు.తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు

IPL 2023: ఏందీ ఈ చెత్త బ్యాటింగ్, హార్దిక్‌ పాండ్యను భారీగా ట్రోల్ చేస్తున్నGT ఫ్యాన్స్, కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట అంటూ విమర్శలు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య చెత్త బ్యాటింగ్ ను ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. . గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్‌.. ఈ సీజన్‌లో మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్య.. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు

PBKS vs GT, IPL 2023: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు, పంజాబ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ ఘనవిజయం, చెలరేగిన ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్

VNS

ఐపీఎల్ 16వ (IPL- 16) సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరు. ఆఖ‌రి ఓవ‌రి వ‌ర‌కు ఫ‌లితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్ విజేత‌గా నిలిచింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న‌ ఓపెన‌ర్‌ శుభ్‌మ‌న్ గిల్(67) అర్ధ శ‌త‌కంతో క‌దం తొక్క‌డంతో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజ‌యం ఖాతాలో వేసుకుంది.

Advertisement
Advertisement