Captains with Most Trophies in Cricket: అంతర్జాతీయ సర్క్యూట్, లీగ్‌ల వంటి పోటీ క్రికెట్‌లో, జట్లకు తమ నాయకత్వ నైపుణ్యంతో విజయాన్ని అందించగల కెప్టెన్‌లు అవసరం. ఈ క్రీడను క్రమం తప్పకుండా అనుసరించే క్రికెట్ అభిమానులు కొందరు స్కిప్పర్లు అంతర్జాతీయ, లీగ్ క్రికెట్‌లో తమ నాయకత్వ పటిమను ఎలా ప్రదర్శించారు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లుగా ఎదిగారనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.
కొంతమంది కెప్టెన్‌లు తమ సమయంలో T20 లీగ్‌లు లేకపోవడం లేదా పెద్ద స్థాయిలో ఆడకపోవడం వల్ల లీగ్ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకునే అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా అత్యధిక టైటిళ్లు ముద్దాడిన వాళ్ల లిస్టు క్రికెట్ అభిమానులు ఓ సారి చూడాల్సిందే.
మహేంద్రసింగ్ ధోనీ: అత్యధిక ట్రోఫీలను ముద్దాడిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలలో పాటు 2007లో కెప్టెన్‌గా తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత 2011లో ధోనీ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ వన్డే ప్రపంచకప్ అందుకుని చరిత్ర సృష్టించింది.
అనంతరం 2013లో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ని కూడా ధోనీ దేశానికి అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, 2010, 2011, 2018, 2021, 2023 ఐపీఎల్ టైటిళ్లు, 2014లో చాంపియన్స్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా మొత్తంగా పది టైటిళ్లు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్‌గా వహిస్తున్న రోహిత్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి ఆ ఘనత సాధించిన తొలి సారథిగా రికార్డులకెక్కాడు. 2015, 2017, 2019, 2020లలో ఐపీఎల్ ట్రోఫీలు, 2013లో చాంపియన్స్ లీగ్ ట్రోఫీని అందుకున్నాడు.
రికీ పాంటింగ్: ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్(Ricky Ponting) 2003, 2007లలో దేశానికి వరుసగా రెండు ప్రపంచ కప్‌లు అందించిపెట్టాడు. ఇక 2003 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత జట్టును 135 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రపంచ కప్‌ను ముద్దాడాడు. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మరోమారు జట్టును జగజ్జేతగా నిలిపాడు. ఇవే కాకుండా 2006, 2009లలో పాంటింగ్ సారథ్యంలోని కంగారూ జట్టు చాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకుంది.
డ్వేన్ బ్రావో: కరీబియన్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(dwayne bravo) కెప్టెన్‌గా నాలుగు సీపీఎల్ ట్రోఫీలు అందుకున్నాడు. 2015-2018 మధ్య సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్()కు మూడు ట్రోఫీలు అందించిన బ్రావో.. 2021లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్()కు తొలి టైటిల్ అందించాడు.
క్లైవ్ లాయిడ్: విండీస్ నుంచి ప్రపంచ కప్‌ను వరుసగా రెండుసార్లు అందుకున్న కెప్టెన్‌గా లాయిడ్ రికార్డులకెక్కాడు. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్ ను దేశానికి అందించాడు. విండీస్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 1979లోనూ మరోమారు విండీజట్టు జగజ్జేతగా నిలిపిన ఘనత ఇతనిదే. ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి రెండోసారి ప్రపంచ కప్ అందుకుంది.
గంభీర్: ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. కేకేఆర్‌కు 2012, 2014లో రెండు టైటిళ్లు అందించాడు. ఫలితంగా అప్పటి వరకు రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ, రోహిత్ సరసన చేరాడు.
హెన్రిక్స్: బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ సిక్సర్స్ (సీసీ)కి ప్రాతినిధ్యం వహించిన హెన్రిక్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపాడు