IPL 2023: కెఎల్ రాహుల్‌పై విరుచుకుపడుతున్న లక్నో ఫ్యాన్స్, ఈ ఆటకు రూ. 17 కోట్లు తీసుకున్నావా అంటూ ట్రోల్, టెస్టు మ్యాచ్ కాదిది అంటూ కామెంట్స్
KL Rahul (Photo-Twitter/ICC)

సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ KL రాహుల్ మళ్లీ విఫలమయ్యాడు.LSG కెప్టెన్ భారీ ఛేజింగ్‌లో 20 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్యాటర్‌గా RCBకి పై  రాహుల్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

సూపర్ జెయింట్స్‌కు ఆట గెలవడానికి 213 పరుగుల భారీ అవసరం ఉన్నందున ఇది అతనికి నల్లేరుపై నడకే అని భావించారు. అయితే, ఓపెనర్ తన ఇన్నింగ్స్‌లో పేలవంగా ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రాహుల్‌ ఆడిన 18 బంతుల్లో కేవలం ఒకే బౌండరీ ఉండడం గమనార్హం.

రెండోసారి చతికిలపడిన బెంగుళూరు, ఓటమి తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసిన అభిమానులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన 61 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన 35 పరుగులే అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. ఆ 35 పరుగులు కూడా 31 బంతుల్లో చేశాడు. ఇక ఆర్సీబీపై చెత్త ఇన్నింగ్స్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి రాహుల్‌.. టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా అంటూ పోస్టులు చేస్తున్నారు.

Here's Troll Tweets

మరి కొంత మంది రూ.17 కోట్లు తీసుకున్నావు.. టెస్టు క్రికెట్‌ కంటే దారుణంగా ఆడుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ఒక్క వికెట్‌ తేడాతో లక్నో విజయం సాధించింది. లక్నో విజయంలో స్టోయినిష్‌(65), పూరన్‌(62) పరుగులతో కీలక పాత్ర పోషించారు.