File Image | Kapil Dev | (Photo Credits: Getty Images)

Kapil Dev Wants To Slap Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే (Rishabh Pant Recovers In Hospital) కోలుకుంటున్నాడు.శస్త్రచికిత్సలు చేయించుకున్న అతడు పూర్తిగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే కనీసం 6 నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ గురించి ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ (Indian cricket legend Kapil Dev) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడిని చెంప దెబ్బ కొట్టాలని ఉందని చెప్పారు. ‘అన్ కట్’ చానల్ తో మాట్లాడిన కపిల్.. పంత్ లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందని అన్నారు. పంత్ పై నాకు ఎంతో ప్రేమ ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.

ఫోన్ సీల్ చేయకుండానే పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ, బాభి ఫోన్ నుండి ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేయాలని జొమాటో సలహా, ఫన్నీ ట్వీట్లు వైరల్

అప్పుడు వెళ్లి చెంప దెబ్బ (Slap Him) కొడతాను. జాగ్రత్తగా ఉండమని చెబుతాను. ‘నువ్వు లేకపోవడంతో జట్టు బలం తగ్గింది’ అని చెబుతాను. అతడిని ఎంతో అభిమానిస్తున్నాను. అదే సమయంలో కోపంగానూ ఉన్నాను. నేటి యువకులు ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారు? వారికి చెంప దెబ్బలు పడాలి’’ అని కపిల్ అన్నారు.అతను ప్రపంచంలోని ప్రేమనంతా పొందాలి. దేవుడు అతనికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. పిల్లలు తప్పు చేస్తే చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నట్లుగానే.. నేను పంత్ ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నా’’ అని చెప్పారు.

కుంబ్లే 10 వికెట్లు తీసిన వీడియో ఇదే, దాయాది దేశానికి చుక్కలు చూపించిన భారత మాజీ స్పిన్నర్

పంత్‌ తాజాగా తన ఆరోగ్యంపై అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఫొటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.అయితే, ఆ ఫొటో ఆసుపత్రి వద్దదే అని తెలుస్తోంది. కాగా పంత్ మోకాళ్లకు వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేశారు. అతడు పూర్తిగా కోలుకొని తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది డిసెంబర్‌ 30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.