సచిన్ టెండుల్కర్ తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ అరంగేట్రాన్ని చూసి మురిసిపోయాడు. ఇంతవరకు అర్జున్ ఆటను నేరుగా చూసిందే లేదని.. తన జీవితంలో ఇదో సరికొత్త అనుభవమంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఆదివారం అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్..రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మొత్తంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు.
కాగా మ్యాచ్‌కు ముందు కుమారుడిని ఉద్దేశించి... ‘‘అర్జున్.. క్రికెటర్‌గా నీ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు. ఓ తండ్రిగా.. నిన్నూ, ఆటను ప్రేమించే వ్యక్తిగా.. క్రికెట్ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతావని నాకు తెలుసు.ఆట కూడా నువ్విచ్చే గౌరవానికి ప్రతిఫలాన్ని ఫలితాల రూపంలో తప్పకుండా అందిస్తుంది. ఇక్కడిదాకా చేరుకోవడానికి నువ్వు ఎంత కఠిన శ్రమకోర్చావో నాకు తెలుసు. అదే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుకుంటావని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’’ అని సచిన్ ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
Here's Video
Arjun Tendulkar made his IPL debut for @mipaltan on Sunday as the legendary @sachin_rt watched his son from the confines of the dressing room 👏🏻👏🏻
Here is the father-son duo expressing their emotions after what was a proud moment for the Tendulkar household👌🏻 - By @28anand pic.twitter.com/Lb6isgA6eH
— IndianPremierLeague (@IPL) April 17, 2023
ఇక మ్యాచ్ చూసిన తర్వాత ఐపీఎల్ ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. ‘‘తనను తాను ఎలా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాడో అలాగే చేయమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ఈరోజు కూడా నేను డ్రెస్సింగ్ రూంలోనే కూర్చున్నా. ఎందుకంటే నన్ను చూస్తే తన ఆలోచనలు మారిపోవచ్చు. తన ప్రణాళికలను అమలు చేసే అంశంపై ప్రభావం పడొచ్చు. మెగా స్క్రీన్ మీద తనను చూస్తూ ఉన్నా. నిజంగా నాకిది కొత్త అనుభవం. 2008లో మొదటి సీజన్.. 16 ఏళ్లవుతోంది.. ఇప్పుడు నా కుమారుడు కూడా ఇదే జట్టుకు ఆడటం బాగుంది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.