Shabnim Ismail Shatters Record With Fastest Delivery: మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమై బంతిని విసిరిన క్రికెటర్ గా రికార్డు నెలికొల్పింది. సెలబ్రిటీలతో అదరహో అనిపిస్తున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్, వీడియోలు, చిత్రాలు ఇవిగో..
దాదాపు షబ్నిమ్ 132.1 కిమీ వేగంతో సంధించింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో షబ్నిమ్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టింది.
Here's News
Reason #132.1 for girls to pursue #Cricket 🫶🏼
Not the finest of spells to remember maybe, but bowling the fastest recorded delivery in women's cricket will always be a special memory, Shabnim. ⚡#DCvMI #TATAWPL pic.twitter.com/aXziQMnTAO
— Delhi Capitals (@DelhiCapitals) March 5, 2024
ఇదిలా ఉంటే గతంలో ఈ రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షబ్నిమ్ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది.మహిళల క్రికెట్‌లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం. 2022 వన్డే వరల్డ్‌కప్‌లో షబ్నిమ్ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది.