Football
FIFA World Cup 2022 Prize Money: రూ.347 కోట్లు ఎగరేసుకుపోయిన అర్జెంటీనా, రూ.248 కోట్లతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్, బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్‌ మెస్సీ
Hazarath Reddyదాదాపు నెల రోజులుగా ఖతర్‌ వేదికగా సాగిన సాకర్‌ సమరం (FIFA World Cup 2022) ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
Lionel Messi Shares Message: గెలుపు అనంతరం లియోనెల్ మెస్సీ భావోద్వేగ ట్వీట్, ఇది అర్జెంటీనాల కల కోసం పోరాడుతున్న అందరి బలమంటూ పోస్ట్
Hazarath Reddyలియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఏకైక ట్రోఫీని - FIFA ప్రపంచ కప్‌ని అందుకోగలిగాడు. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజయంలో మెస్సీ కథానాయకుడు. FIFA ప్రపంచ కప్ 2022 విజయం తర్వాత, లియోనెల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్ చేశాడు.
FIFA World Cup 2022 Final: వైరల్ వీడియోలు, అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక ఫ్రాన్స్‌లో అల్లర్లు, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Hazarath Reddyసాయంత్రం ఫ్రాన్స్ రాజధాని వీధుల్లో వేలాది మంది పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించారు. ప్యారిస్‌లోని ఛాంప్స్-ఎలీసీస్‌లో చట్టాన్ని అమలు చేసే వారిపై బాణాసంచా కాల్చడం కొనసాగించిన అభిమానులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
FIFA World Cup 2022 Final: అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Hazarath Reddyఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో ఓటమి తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు.
FIFA World Cup 2022: అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల గెలుపు సంబరాలు.. వైరల్ వీడియో
Rudraఅర్జెంటీనా దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఫైనల్లో ఫ్రాన్స్‌ ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
Argentina Win FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌ మరోసారి అర్జెంటీనా కైవసం, ఫుల్ కిక్కిచ్చిన ఫైనల్ మ్యాచ్, షూటవుట్‌తో దుమ్మురేపిన అర్జెంటీనా, మెస్సీకి విక్టరీతో ఘన వీడ్కోలు
VNSపెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (FIFA World Cup 2022) ఉత్కంఠగా సాగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది.
Lionel Messi World Record: ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌తో మెస్సీ అరుదైన రికార్డు, కెరీర్‌లో చివరి మ్యాచ్‌తోనే రికార్డు బద్దలు కొట్టిన ఫుట్‌బాల్ లెజెండ్‌
VNSఅర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ (Lionel Messi) మ‌రో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైన‌ల్‌తో (World Cup final) క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జ‌ర్మ‌నీకి చెందిన లోథ‌ర్ మ‌థాస్ రికార్డును బ్రేక్ చేశాడు.
FIFA World Cup 2022: షాకింగ్ వీడియో, ఫ్రాన్స్‌ చేతిలో మొరాకో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ దేశ అభిమానులు, బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించిన 100 మంది ఫ్యాన్స్
Hazarath Reddyఫిఫా ప్రపంచకప్-2022లో ఖతర్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌..మొరాకోను చిత్తు చేసి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. నాకౌట్‌ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్‌ నుంచి ఇంటిముఖం పట్టింది. మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
FIFA WC 2022: ఫిఫాలో మరోసారి ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, రెండో సెమీస్‌లో మొరాకోను చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్, ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌కోసం సర్వం సిద్ధం
VNSఫిఫా ప్రపంచ కప్‌-2022లో మూడో స్థానం కోసం శనివారం మొరాకో-క్రొయేషియా తలపడతాయి. కాగా, మొరాకోపై గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించడంతో ఫ్రాన్స్ లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది.
Lionel Messi Goal Video: మెస్సి పెనాల్టీ గోల్ వీడియో ఇదే, ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన అర్జెంటీనా కెప్టెన్
Hazarath Reddyక్రొయేషియాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌లో.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుత‌మైన గోల్ చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మ‌లిచాడు. నిజానికి క్రొయేషియా గోల్ కీప‌ర్ లివాకోవిక్ ఆ షాట్‌ను సరైన రీతిలోనే అంచ‌నా వేసినా.. మెస్సీ ప‌వ‌ర్‌ఫుల్ కిక్ గోల్ పోస్టులోకి దూసుకువెళ్లింది.
Lionel Messi Retirement: లియోనల్‌ మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన, డిసెంబర్ 18న జరగబోయే ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తన చివరి మ్యాచ్ అని వెల్లడి
Hazarath Reddyఅర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు. ఖతర్‌ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అర్జెంటీనా తరపున చివరిదని స్పష్టం చేశాడు.
FIFA World Cup 2022: ఇంటి దారి పట్టిన పోర్చుగల్, సెమీఫైనల్‌కు చేరుకున్న మొరాకో, క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో ఘన విజయం
Hazarath ReddyFIFA ప్రపంచ కప్ 2022లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. 42వ నిమిషంలో ఎన్‌-నెసిరి హెడర్‌తో ఆధిక్యం సాధించడంతో పోర్చుగల్‌పై మొరాకో మెరుపుదాడి చేసింది.
Grant Wahl Dies: అమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ కన్నుమూత.. సాకర్ ప్రపంచ కప్ కవరేజీ చేస్తుండగా ఘటన
Rudraఅమెరికా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ (49) కన్నుమూశారు. సాకర్ ప్రపంచ కప్ లో భాగంగా నిన్న అర్జెంటినా-నెదర్లాండ్స్ మ్యాచ్ కవరేజీ చేస్తుండగా ఆయన కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
FIFA World Cup 2022: సముద్రపు ఒడ్డున నిర్మించిన స్టేడియంను కూల్చివేస్తున్న ఖతార్, దీని అందాలు చివరిసారిగా చూడాలంటూ పోస్ట్
Hazarath Reddyఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం ఖతార్ ప్రభుత్వం నిర్మించిన ఏడు స్టేడియాలలో ఖతార్ ఐఎస్ డీ కోడ్ 974 స్టేడియం ఒకటి. ఇది దోహాలో సముద్రపు ఒడ్డున ఉంది. ఫిపా వరల్డ్ కప్ 2022 తర్వాత ఈ స్టేడియంను కూల్చేస్తామని అధికారులు అంటున్నారు అధికారులు.
FIFA World Cup 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బెల్జియంను చిత్తు చేసిన మొరాకో.. అల్లర్లకు దారితీసిన ఘటన.. వీడియోతో..
Rudraఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొరాకో జ‌ట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ విజయం బ్రసెల్స్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది.
Camel Flu Infection in Qatar: ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్... పొంచి ఉన్న 'కేమెల్ ఫ్లూ' ముప్పు.. మధ్య ప్రాచ్యదేశాల్లో అధికంగా కనిపించే వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమైనదా? అసలు ఏమిటీ 'కేమెల్ ఫ్లూ'??
Rudraఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సాకర్ మెగా ఈవెంట్ చూసేందుకు ఖతార్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఖతార్ లో 'కేమెల్ ఫ్లూ' వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.
FIFA World Cup 2022: బైనాక్యుల‌ర్స్‌లో బీర్‌ను తీసుకువెళ్లిన అభిమాని,షాకయిన సెక్యూరిటీ సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది.అయితే టెన్ష‌న్ త‌ట్టుకోలేని కొంద‌రు అభిమానులు స్టేడియంకు మ‌ద్యాన్ని తీసుకువెళ్తున్నారు.
Ronaldo to Leave Manchester United: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డోకు ఎదురుదెబ్బ, క్లబ్ నుంచి తొలగిస్తూ మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటన, రెండేళ్ల కాంట్రాక్టును మధ్యలోనే బ్రేక్ చేస్తూ నిర్ణయం, టీవీ షో లో రొనాల్డో చేసిన కామెంట్లే కారణం
Naresh. VNSఒకవైపు ఫిఫా (FIFA) జోరు కొనసాగుతుండగానే...మరోవైపు పుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. ఆయన్ను వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రముఖ ప్రీమియర్ లీగ్ జెయింట్ మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) ప్రకటించింది.
FIFA World Cup 2022: హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతు, జాతీయ గీతం పాడటానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు
Hazarath Reddyస్వదేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా నవంబర్ 21, సోమవారం నాడు FIFA వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్ B మ్యాచ్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించారు.
Soccer Cup: సాకర్ ప్రియులను ఉర్రూతలూగించే ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం.. నేటి నుంచి డిసెంబరు 18 వరకు పోటీలు.. ఖతార్ వేదికగా ఫుట్ బాల్ ప్రపంచకప్.. మొత్తం 32 జట్లతో సాకర్ సంరంభం.. తొలి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ
Rudraఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి.