రాష్ట్రీయం
MLA Padi Kaushik Reddy: తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో
Arun Charagondaతనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని..దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీకి మంగళహారతులతో స్వాగతం పలికేందుకు తాము ఉంటే కోడిగుడ్లు, టమోటోలతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు.
Harishrao On Kaushik Reddy Issue: కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన హరీశ్ రావు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్న, ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్..
Arun Charagondaఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.
MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు
Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటో, కోడిగుడ్లతో దాడి, అరికెపూడి గాంధీ అనుచరుల బీభత్సం, కౌశిక్ ఇంటికి బయల్దేరిన హరీశ్ రావు..వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు సవాల్, ప్రతిసవాల్‌కు దిగగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలు దేరారు గాంధీ. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pocharam Vs Ravinder Reddy: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అవాక్కయిన పోలీసులు..వీడియో
Arun Charagondaఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బాన్సువాడ - వర్ని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: వినాయక మండపం వద్ద డీజే సౌండ్ గొడవ, కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్, సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పిన వినకపోవడంతో కత్తితో దాడి.. వీడియో
Arun Charagondaహిందూపురంలో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించాడు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని లక్ష్మీపురంలో శ్రీహరి అనే వ్యక్తి కత్తితో బీభత్సం సృష్టించాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, వినాయకుడి మండపం వద్ద డీజే సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పినా వినకపోవడంతో కత్తికి పనిచెప్పాడు
Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరదలతో ఇంకా తీరని కష్టాలు, ప్రభుత్వం అందించే ఆహారం కోసం ఎగబడ్డ జనాలు
Hazarath Reddyవిజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.
Arekapudi Gandhi Vs Kaushik Reddy: ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు గాంధీ.
Fake Whatsapp Calls Alert: మీ కూతురు కిడ్నాప్ అంటూ వాట్సప్ కాల్స్, అలర్ట్ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్, అలాంటివి నమ్మవద్దని హెచ్చరిక
Hazarath Reddyస్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్, పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్యాష్ పిటిషన్
Hazarath Reddyసత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.
Students Protest: పీఈటీ వేధింపులు తాళలేక విద్యార్థుల ధర్నా, మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీసి బెదిరిస్తోందని రోడ్డుపై బైఠాయింపు, పీఈటీకి వ్యతిరేకంగా నినాదాలు
Arun Charagondaసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా పీఈటీ జ్యోత్స్న ప్రవర్తిస్తోందని ఆరోపిస్తు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు.
Cancer Patient Last Wish: దేవర సినిమా చూసి చనిపోతా..క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక, అప్పటివరకు బతికించండని విన్నపం
Arun Charagondaదేవర సినిమా చూసి చనిపోతా..సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండని ఓ క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక కోరాడు. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్(19)కు బోన్ క్యాన్సర్ అని నిర్దారించారు డాక్టర్లు. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కౌశిక్.. దేవర సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించమని కోరారు. తన కొడుకు ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు
Attack On Female Doctor: వీడియో..గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై దాడి, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaసికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి కలకలం రేపింది. ఓ లేడి జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని , ఆమె ఆఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు పోలీసులు.
Rain Alert: మరో వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షం ముప్పు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక!
Arun Charagondaఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Attack on Female Doctor in Gandhi Hospital: వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు
Hazarath Reddyసికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై రోగి బంధువు దాడి చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. రోగి బంధువు లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు.
Student Bitten by Snake: వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.
Dog Last Rites: పోలీస్ శాఖలో 8 ఏళ్ల పాటు సేవలందించిన కుక్క మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన నిజామాబాద్ పోలీసులు
Hazarath Reddyఅధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర
Hazarath Reddyఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.
HMDA Services: హెచ్ఎండీఏ సేవలకు అంతరాయం , ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు
Arun Charagondaహెచ్‌ఎండీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. డేటా ఓవర్ లోడ్ అయినట్లు నిన్న అర్ధరాత్రి గుర్తించారు అధికారులు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోరే చేసే ప్రయత్నాలు చేయగా దీంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.