రాష్ట్రీయం

Warangal Road Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, ఎదురుగా వెళుతున్న లారీలో నుంచి కారుపై పడ్డ ధాన్యం బస్తాలు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేములవాడకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న కారుపై ముందు నుంచి ఎదురుగా వెళ్తున్న లారీలోని ధాన్యం బస్తాలు పడిపోవడంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు.

IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, విచారణకు సహకరించకుంటే బెయిల్‌ రద్దు కోరవచ్చని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని... చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్

Hazarath Reddy

తెలంగాణలోని హైదరాబాద్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా వచ్చిన గూడ్స్ ట్రక్ ఢీకొట్టి పొదల్లో బోల్తా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది.

Advertisement

Myanmar Refugee Murder: హైదరాబాద్ నగరంలో మయన్మార్‌ యువకుడి దారుణ హత్య, ఫోన్ తిరిగి ఇవ్వమన్నందుకు యువకుడిని కత్తితో దారుణంగా పొడిచిన రౌడీ షీటర్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ తిరిగి ఇవ్వాలని వేడుకున్న మయన్మార్‌ యువకుడిని ఓ రౌడీ షీటర్ తన అనుచరుడితో కలిసి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.

Stray Dog Attack in Hyd: బాబోయ్..యువకుడి పిక్క పట్టుకుని వదలకుండా కరిచిన వీధి కుక్క, ఎంతమంది తరిమినా భయపడని స్ట్రీట్ డాగ్, వీడియో ఇదిగో

Hazarath Reddy

హైదరాబాద్ నగరాన్ని వీధికుక్కలు వణికిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న పాదాచారులను వెంటాడి మరీ కరుస్తున్నాయి. తాజాగా మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. రెండు రోజుల్లో నలుగురి పై దాడి చేశాయి. వీధి కుక్కల దాడులతో మణికొండ ప్రజలు వణికిపోతున్నారు

Nalgonda Road Accident: దేవుని దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే మృతి,వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన లారీ

Hazarath Reddy

మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం (Nalgonda Road Accident) చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో నందిపాడు మండలానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.కృష్ణాజిల్లా మోపిదేవి ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళుతుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీ బైపాస్‌ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Secunderabad Horror: సికింద్రాబాద్‌ లో దారుణం.. డబ్బుల కోసం అర్ధ‌రాత్రి యాచ‌కుల‌పై దాడి.. ఒక‌రు మృతి

Rudra

సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప‌రిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు యాచకుల‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడుల‌కు పాల్ప‌డ్డారు.

Advertisement

Hyderabad Road Accident Viral Video: కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై మహిళను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

sajaya

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లి బోల్తా పడిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ మరియు సమయం తెలియదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Astrology: ఫిబ్రవరి 5 నుంచి సౌభాగ్య యోగంతో ఈ 5 రాశుల వారికి ఇక అదృష్టం ప్రారంభం..మీ డబ్బు అమాంతం పెరిగే అవకాశం..

sajaya

ఫిబ్రవరి 5 నుంచి శోభన యోగం, సౌభాగ్య యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా సింహం, తులారాశితో సహా ఇతర 5 రాశులకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

IAS Transfers: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల కోసం రంగం సిద్ధం, ఒకేసారి 21 మంది ఐఏఎస్ ల‌కు స్థాన‌చ‌లనం, ఇందులో కొత్త జిల్లాల క‌లెక్ట‌ర్లే ఎక్కువ‌

VNS

ఎన్నిక‌ల ముందు జ‌రిగే సాధార‌ణ బ‌దిలీల ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. ఏకంగా ఒకేసారి 21 మంది ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది (IAS Officers Transferred) ప్ర‌భుత్వం. చాలా కాలంగా ఒకే చోట ఉన్న ఐఏఎస్ ల‌కు స్థానచ‌ల‌నం కల్పించింది. కొద్ది రోజుల క్రితం కూడా ప‌లువురు ఐఏఎస్ ల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసింది ప్ర‌భుత్వం

IND Vs ENG: ఉప్ప‌ల్ టెస్ట్ సూప‌ర్ హిట్, చాలా గ్యాప్ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ కు భారీగా స్పంద‌న‌, ఫ‌స్ట్ టెస్టుకు ఏకంగా లక్ష‌మంది హాజ‌రు

VNS

నాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్‌ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో భారత్‌ స్వదేశంలో ఆడిన టెస్టులకు ఇంతమంది హాజరవడం బహుశా ఇదే ప్రథమం. 2018 తర్వాత టెస్టులకు ఉప్పల్‌ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిచ్చింది.

Advertisement

Galla Jayadev: రాజ‌కీయాల‌కు దూరంగా మ‌హేష్ బాబు బావ‌! సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న టీడీపీ ఎంపీ, చిన్న వ‌య‌స్సులోనే రాజకీయాల‌ను ఎందుకు వ‌దిలేస్తున్నారంటే?

VNS

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌(TDP MP Galla Jayadev ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఒక ఒరలో రెండు కత్తులుండవన్నట్లు అటు రాజకీయం, ఇటు వ్యాపారం( Business ) చేయలేకపోతున్నానని స్పష్టం చేశారు.

CM Revanth Reddy Meets MLA Prakash Goud: KCRకు షాక్...సీఎం రేవంత్ రెడ్డితో BRS ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ..పార్టీ మార్పు అంటూ ఊహాగానాలు..? (Video)

sajaya

బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారా..అంటే అవుననే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెళ్లారు. అంతేకాదు ఆయన గంట సేపు పైగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేశారు.

Viral Video: రామాంతపూర్‌లో దారుణం.. పిస్టల్‌తో బెదిరించిన హోంగార్డ్..భయంతో సామాన్య వ్యక్తి విషం తాగి ఆత్మహత్య

sajaya

రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో హోంగార్డ్ నాగరాజు హల్చల్ చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిస్టల్‌తో ఇంటిపక్కనే నివాసం ఉండే శ్రీనివాస్(55)ని బెదిరించడంతో అతడు భయపడి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad Shocker: మణికొండలో తల్లి కొడుకులపై వీధి కుక్కల దాడి..వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం..(Viral Video)

sajaya

మణికొండ శ్రీనివాస నగర్ కాలనీ లో కిరాణ కొట్టుకు వచ్చిన తల్లి కొడుకులపై కుక్కల దాడి. యువకుడి కాళ్లు పట్టుకొని చీల్చి చెండాడిన వీధి కుక్క. వీధి కుక్కల దాడులతో వణికిపోతున్న మణికొండ ప్రజలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్న వీధి కుక్కలు. మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. రెండు రోజుల్లో నలుగురి పై దాడి.

Advertisement

Snake on Shivalinga: రామాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము.. వీడియో ఇదిగో

Rudra

హుజూరాబాద్‌ పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది.

Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం

Rudra

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్‌ టవర్‌ తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్‌ గడియారంలో టైమ్‌ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.

Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

Rudra

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

IMD Hyderabad: ఏప్రిల్ వరకు ఎల్‌నినో ప్రభావం, ఈ సారి ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హైదరాబాద్ వాతావరణశాఖ

VNS

చలికాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత (Cold Wave) క్రమంగా తగ్గి ఫిబ్రవరి రెండో వారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్‌లో చలి తీవ్రత ఎక్కువగానే ఉందని, ఉష్ణోగ్రతలు (Temperatures) కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) డైరెక్టర్‌ నాగర్నత తెలిపారు.

Advertisement
Advertisement