రాష్ట్రీయం

Inter Exam Schedule: ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌.. మార్చి 18న పది పరీక్షలు షురూ.. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌

Rudra

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్‌ ఎగ్జామ్‌ జనవరిలో, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Hyderabad Biryani at Taste Atlas: ప్రపంచం మెచ్చిన మన హైదరాబాద్‌ బిర్యానీ.. టేస్ట్‌ అట్లాస్‌ ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో చోటు

Rudra

హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారపదార్థంగా మన బిర్యానీ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

Praja Palana Applications: నేటి నుంచి ప్రజా పాలన.. ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.

TSPSC Group 2 Exam Postponed: గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా, జనవరి 6, 7 తేదీలకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్..

sajaya

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.

Advertisement

Car Caught Fire Video: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం వెనుక కారుకు ఒక్కసారిగా అంటుకున్న మంటలు

Hazarath Reddy

తెలంగాణ సచివాలయం వెనుక మింట్ కాంపౌండ్ సమీపంలో కారుకు మంటలు అంటుకున్నాయి. కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే నీటితో ఆర్పేసారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.వీడియో ఇదిగో..

Andhra Pradesh: తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించిన ఏపీ ప్రభుత్వం, ఐజీగా ప్రమోషన్ పొందిన ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌

Hazarath Reddy

ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీగా పదోన్నతి లభించిన వారిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

Ram Gopal Varma: తల నరికితే రూ.కోటి వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ, ఫిర్యాదులో ఎవరెవరినీ చేర్చారంటే..

Hazarath Reddy

టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

New Year 2024: కొత్త సంవత్సరం వేడుకలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడితే అంతే ఇక, న్యూ ఇయర్‌ వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు ఇవిగో..

Hazarath Reddy

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో సైబరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ఆ రూట్లో అనుమతించనున్నట్లు తెలిపారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం అవ్వండి, ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో హైకమాండ్ కీలక సమావేశం

Hazarath Reddy

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖార్గే ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఖర్గేతో పాటు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.

Telangana Job Calendar 2024: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, 2 లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటన, వీడియో ఇదిగో...

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను అందించారు. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 9 2024 లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీడియో ఇదిగో..

Six Guarantees Application Form Out: ఆరు గ్యారంటీల దరఖాస్తును విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విడుదల (Six Guarantees Application Form Out) చేశారు.

US Road Accident: వీడియో ఇదిగో, అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు మృతి

Hazarath Reddy

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు

Advertisement

Hyd Car Rash Driving Case: ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసును పక్కదోవ పట్టించిన పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌, భోదన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్‌పై లుక్ అవుట్ నోటీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Hyd Car Rash Driving Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌ (Punjagutta CI durga rao suspended) అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు

Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒకదానితో ఒకటి ఢీకొన్న ఐదు వాహనాలు

Hazarath Reddy

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది జంక్షన్‌లో ఈ ఉదయం జరిగిందీ ఘటన

Hyderabad: వీడియో ఇదిగో, నీది బాగుంది అంటూ అమ్మాయిలకు అసభ్య మెసేజ్‌లు, యువకుడిని పట్టుకుని చితకబాదిన యువతి

Hazarath Reddy

హైదరాబాద్ సూరారం PS పరిధిలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నాని అలియాస్ సికిందర్(26) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆ సెంటర్‌కు వచ్చే అమ్మాయిల నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని వారికి వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు. విసిగిపోయిన యువతులు ఈరోజు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Six Guarantees Application Form: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అప్లికేషన్ ఫారం ఇదిగో, అన్నింటికీ ఒకటే దరఖాస్తు, ఎలా నింపాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభల్లో ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అభయహస్తం పేరుతో రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేయనున్నారు

Advertisement

Telangana Fire: అత్తాపూర్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం, కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Singareni Election: సింగ‌రేణిలో కొన‌సాగుతున్న పోలింగ్, కోల్ బెల్ట్ లో జెండా పాతేది ఎవ‌ర‌న్న‌ది తేలేది అర్ధ‌రాత్రి త‌ర్వాతే, ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 39 వేల కార్మికులు

VNS

పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు బ్యాలెట్ పెట్టెలను తరలించి రాత్రి 7గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. అయితే, పూర్తిస్థాయి ఫలితాలు అర్థరాత్రి తరువాతే వెల్లడికానున్నాయి.

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తా: టీవీ డిబేట్ లో కొలికిపూడి శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు

sajaya

మంగళవారం ఓ టీవీ డిబేట్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే వాళ్లకు కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ వీడియో క్లిప్‌ను ఏపీ పోలీసులకు ఆర్జీవీ ట్యాగ్ చేశారు. దీనినే తన అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని పోలీసులకు ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు.

CM Revanth & Deputy CM Bhatti Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ, విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని వెల్లడి

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చర్చించిన అంశాలపై రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని భట్టి తెలిపారు.

Advertisement
Advertisement