ఆంధ్ర ప్రదేశ్

Gautam Sawang Resign: ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి గౌత‌మ్ స‌వాంగ్ రాజీనామా, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండేళ్ల ముందే నిర్ణ‌యం, గ్రూప్ 2 మెయిన్స్ కూడా వాయిదా

VNS

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు (Abdul Nazeer) అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ (APPSC Chairman) అయ్యారు.

Telugu States CMs in Delhi: ప్ర‌ధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై తెలుగురాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముందు కీల‌క ప‌రిణామం

VNS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra modi) ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth reddy) విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.

Free Sand Policy in Andhra Pradesh: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం అమల్లోకి, చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం, వైసీపీ అక్రమాలపై విచారణ..

Hazarath Reddy

త్వరలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి తెలిపారు

Andhra Pradesh: అమరావతిని చూస్తే ఎంతో బాధ కలుగుతోంది, నా కష్టం అంతా జగన్ వృథా చేశాడని మండిపడిన చంద్రబాబు, శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి కోసం తాము పడిన కష్టం అంతా వృథా అయిందన్నారు. అయిదేళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు.

Advertisement

Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో

Hazarath Reddy

నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Pawan Kalyan Greets Little Boy: జనసేన జెండాతో రోడ్డుపై చిన్నారి, కాన్వాయ్ ఆపి దగ్గరకు వెళ్లి పలకరించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చిన్నారి అభిమానిని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు.

Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, మాజీ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ బయోడేటా ఇదే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్డాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు

ASI Committed Suicide: వీడియో ఇదిగో, రైలు కిందపడి కమలాపురం ఏఎస్సై ఆత్మహత్య, యూనిఫామ్‌ తీసి పక్కనపెట్టి మరీ సూసైడ్

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లాలో కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్‌ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలుపట్టాలపై ఆయన మృతదేహం లభ్యమైంది

Advertisement

Monsoon 2024: ఐఎండీ గుడ్ న్యూస్, ఆరు రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు జూన్ మధ్యలో మందగించిన పురోగతిని సాధించినప్పటికీ, సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. "నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా పురోగమించాయి.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీకి వచ్చేసిన బుల్డోజర్‌ సంస్కృతి, తిరువూరులో వైసీపీ భవనాన్ని కూల్చేందుకు కార్యకర్తలతో కలిసి బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌

Hazarath Reddy

సినిమాల్లో విలన్‌ సీన్లను తలపించేలా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ వ్యవహారం సాగింది. ఎ.కొండూరు మండలం కంభపాడులో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌సీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు బుల్డోజర్‌ను వెంటపెట్టుకుని టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యేర్యాలీగా వెళ్లారు.

Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత

Hazarath Reddy

ఇకపై ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి

Andhra Pradesh Horror: గాజువాకలో దారుణం, కోడలి నోట్లో మామ పురుగుమందు పోస్తే ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టిన భర్త, చికిత్సపొందుతూ బాధితురాలు మృతి

Hazarath Reddy

విశాఖపట్నం గాజువాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న మొగుడే కాల యముడయ్యడు. భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. విశాఖలోని గాజువాకలో భార్యా భర్తలు పద్మిని నివాసం ఉంటున్నారు.

Advertisement

School Bus Accident: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, కావలి జాతీయ రహదారిపై స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ, 15 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందేసిన ఒంగోలు ఏఎస్ఐ, సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

గ్రామంలో గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందేసి చిందేసిన వీడియో వైరల్ అవుతోంది. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు.

CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్‌ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం

Rudra

విభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు

Advertisement

Ladakh Tank Accident: లడఖ్‌ విషాదం, విజయవాడకు చేరుకున్న ఏపీ జవాన్ల మృతదేహాలు, అమరులైన జవాన్ల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి జగన్‌ విజ్ఞప్తి

Hazarath Reddy

లద్దాఖ్‌ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల భౌతికకాయాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్‌ నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో జవాన్ల భౌతికకాయాలను తీసుకువచ్చారు. జవాన్ల భౌతికకాయాలను బాపట్ల, పెడన, గిద్దలూరుకు అధికారులు తరలించనున్నారు.

‘NTR Bharosa’ Pension Scheme: రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.

Nellore Fire Video: నెల్లూరులో శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని న్యూ హాల్ సెంటర్‌లోని శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.

Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..

Hazarath Reddy

అనకాపల్లి జిల్లా కోటవురట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు దౌర్జన్యంగా పాక నిర్మాణంపై నిలదీసిన ఇద్దరి మహిళలపై పాశవికంగా దాడి చేశారు కొందరు వ్యక్తులు. మహిళల దుస్తులు చించివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Advertisement
Advertisement