ఆంధ్ర ప్రదేశ్

AP Election Results 2024: పులివెందులలో వైఎస్ జగన్ విజయం, గతంతో పోలిస్తే తగ్గిన మెజారిటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ పులివెందులలో విజయం సాధించినా.. ఈసారి మెజార్టీ తగ్గడం గమనార్హం. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

AP Election Results 2024: ఎనభైకి పైగా సీట్లలో అభ్యర్థులను మార్చడమే జగన్ కొంపముంచిందా? 18 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ, ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు సాధించిన కూటమి

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్‌ జగన్‌ అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే ఖాతా కూడా తెరవలేదు.

AP Election Results 2024: ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగ బద్ధమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

Jagan on Election Results: ఓటములు కొత్తేమీ కాదు, తట్టుకుని నిలబడి గెలిచాం, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ భావోద్వేగం, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడి అయ్యాయి. మంత్రలు అందరూ ఓటమి పాలైయారు. 175 సీట్లకు గాను పార్టీ కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకోనుంది. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.

Advertisement

Andhra Pradesh Election Results 2024: వీడియో ఇదిగో, చంద్రబాబు ఇంట్లో సంబరాల వేడుకలు, విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికే స్పష్టమైన ఆధిక్యం రావడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు

AP Election Results 2024: వీడియో ఇదిగో, ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Andhra Pradesh Election Results 2024: పేర్లు మార్పు షురూ చేసిన టీడీపీ, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ పేర్లు మార్పును టీడీపీ కార్యకర్తలు స్టార్ట్ చేశారు. తాజాగా విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Gudivada Election Result 2024: గుడివాడలో కొడాలి నానికి ఘోర పరాభవం, 51 వేల పై చిలుకు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఘన విజయం

Hazarath Reddy

గుడివాడలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నానికి ఘోర పరాభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 50 వేల పై చిలుకు ఓట్లతో కొడాలి నానిపై గెలుపొందారు. పోటీ చేసిన ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

Kadapa Election Result 2024: వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో ఎగిరిన టీడీపీ జెండా, 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి

Hazarath Reddy

వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి, ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్ర‌స్తుతం ఆమెకు 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో ఉండ‌గా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Pithapuram Election Result 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం, 69,169 ఓట్ల మెజార్టీతో వంగా గీతపై విక్టరీ నమోదు చేసిన జనసేన అధినేత

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. టిడీపీ కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..టీడీపీ ఇప్పటికే 32 చోట్ల ఘన విజయం సాధించింది

TDP To Leave NDA? దేశ రాజకీయాల్లొ చంద్రబాబు కింగ్ మేకర్ కానున్నారా ? ఘన విజయం సాధించినందుకు టీడీపీ అధినేతకు ప్రధాని మోదీ అభినందనలు

Hazarath Reddy

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం వైపు తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉంది.

AP Elections Result 2024: మైలవరం నుంచి 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

AP Elections Result 2024: సీఎం పదవికి రాజీనామా చేయనున్న జగన్, కాసేపట్లో రాజ్‌భవన్‌కు వైసీపీ అధినేత, భారీ ఓటమి దిశగా వైఎస్సార్సీపీ పార్టీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.

AP Elections Result 2024: ఏపీలో ఖాతా తెరిచిన బీజేపీ, అన‌ప‌ర్తిలో న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం, 160కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో టీడీపీ కూటమి

Hazarath Reddy

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అన‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ నేత‌గా ఉన్న న‌ల్ల‌మిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం కాషాయ పార్టీ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Lok Sabha Elections Result 2024: మేజిక్ ఫిగర్‌కి దూరంగా బీజేపీ, చంద్రబాబు చుట్టూ కేంద్ర రాజకీయాలు, మద్దతు కోసం టీడీపీ అధినేతని కలవనున్న కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

చంద్రబాబును కలవనున్న కేసీ వేణుగోపాల్. చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ను కలవనున్న ఇండియా కూటమి నేతలు.. బీజేపీ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలకు దిగిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మమత బెనర్జీ. నవీన్ పట్నాయక్ ను కలవనున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

AP Elections Result 2024: టీడీపీ ఖాతాలో రెండో విజయం, రాజమండ్రి అర్బ‌న్‌ నుంచి 55వేల‌కు పైగా మెజార్టీతో గెలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘ‌న విజ‌యం సాధించారు.

Advertisement

AP Elections Result 2024: అమరావతిలో ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం, 125 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్న టీడీపీ

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.

AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్, నరసారావు పేటలో భారీ ఆధిక్యం దిశగా టీడీపీ కూటమి

Hazarath Reddy

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిన వైసిపి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

Roja Tweet: న‌గ‌రిలో ఓట‌మి దిశ‌గా రోజా, ట్విట్ట‌ర్ లో చిరున‌వ్వులు చిందిస్తూ కొటేష‌న్ పోస్టు చేసిన ఫైర్ బ్రాండ్, నెటిజ‌న్లు ఏమంటున్నారంటే?

VNS

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (AP Assembly Election Result) కూటమి హవా కొనసాగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రులు ఇద్దరుముగ్గురు మినహా మిగిలినవారంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.

AP Elections Result 2024: విశాఖ రుషికొండపై రెపరెపలాడిన టిడిపి జెండా, ఎన్నికల ఫలితాల జోష్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విశాఖ రుషికొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు. ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ

Advertisement
Advertisement