ఆంధ్ర ప్రదేశ్

Chittoor: వ‌రిగ‌డ్డితో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్, ఎదురుగా వెళ్తున్న మ‌రో లారీని డీకొట్ట‌డంతో న‌లుగురు మృతి, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

VNS

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం (BangaruPalyam) మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా (4 Dead), మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయపడిన వారిని పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు

Hazarath Reddy

నిన్న జరిగిన ఎన్నికల్లో ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది.

Andhra Pradesh Elections 2024: దారుణం, వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఓ కసాయి కొడుకు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, భూమా అఖిలప్రియ బాడీగార్డును కారుతో ఢీకొట్టిన దుండగులు, పరిస్థితి విషమం

Hazarath Reddy

గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్‌ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

White Tiger Died: నెహ్రూ జూ పార్క్ లో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి, అరుదైన వ్యాధితో క‌న్నుమూసిన తెల్ల‌పులి

VNS

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్ (White Tiger) మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి (Tiger) గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.

Palnadu Road Accident: ప‌ల్నాడులో ప్రైవేట్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు, ఆరుగురు స‌జీవ ద‌హ‌నం, ఓటు వేసి తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా విషాదం

VNS

పల్నాడు జిల్లాలో (Palnadu) అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది (Accident). దీంతో క్షణాల్లో బస్సులో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ ప‌ర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నిక‌ల సంఘం

VNS

గత రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది

Andhra Pradesh Elections 2024: వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు

Hazarath Reddy

ఏపీ ఎన్నికల వేళ నరసరావుపేట (Narasaraopet)లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు (YCP Leaders) ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ

Hazarath Reddy

ఏపీలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని ఇవాళ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

CM Jagan UK Visit: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి, ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో ఇంకా క్లారిటీ రాని పూర్తి స్థాయి పోలింగ్ శాతం, గత ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదు, ఈ సారి దాన్ని క్రాస్ చేసిన ఓటింగ్ శాతం

Hazarath Reddy

ఏపీలో మునుపెన్నడూ చూడని రీతిలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దాంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో, కొన్ని పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరగడంతో పోలింగ్ శాతం పెరిగింది.

Advertisement

Hyderabad: చంద్రబాబు సీఎం కావాలంటూ వెంకటేశ్వరస్వామి ముందు నాలుక కోసుకున్న వీరభక్తుడు, గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఇలాంటి పనే..

Hazarath Reddy

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు

Chandrababu on PM Modi: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చారిత్రాత్మక సందర్భం.. పవిత్ర స్థలం.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పనిచేశారని అన్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి.

Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో సాయంత్రం 5 గంటలకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇదిగో, లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే..

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు

Hazarath Reddy

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు

Andhra Pradesh Elections 2024: నా భార్య ముందు నువ్వు అస‌లు క‌మ్మొడివేనా అని దూషించాడు, అందుకే చెంప పగలగొట్టానంటూ క్లారిటీ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

Hazarath Reddy

తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు.

Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఇదిగో, ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది.మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు

Hazarath Reddy

ఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది.

Advertisement
Advertisement