ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: ఏపీలో గంజాయి స్మగ్లింగ్ కలకలం, 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న చింతపల్లి పోలీసులు, విలువ రూ. 3 కోట్ల పైమాటే, ముగ్గురు అరెస్ట్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ | చింతపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఛేదించారు. వారి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చింతపల్లి పోలీసులు తెలిపారు.
Ex-Ranji Cricketer Arrested: సీఎం జగన్ పీఏనంటూ ముంబై వ్యాపారికి రూ.12 లక్షలు టోకరా, మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ ముంబై వ్యాపారిని బురిడీ కొట్టించిన మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ (Ex Ranji Cricketer Arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల బుడుమూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్‌ మాజీ రంజీ క్రికెటర్‌.
AP Budget 2023: వీడియో ఇదిగో, స్పీకర్ పోడియం పైకి పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు, 14 మందిని ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
Hazarath Reddyటీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.
Potti Sriramulu Jayanti: పొట్టిశ్రీరాములు జయంతి, అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్
Hazarath Reddyఅమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ ‍జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.
AP Budget 2023: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.21,434.72 కోట్లు, వార్షిక బడ్జెట్‌ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఅసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
AP MLC Election Result: ఆగని జగన్ దూకుడు, 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం, గోదావరి జిల్లాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ
Hazarath Reddyస్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది.
MLC Elections Results 2023: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, స్థానిక సంస్థల ఫలితాలు ఈ మధ్యాహ్నం, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు వచ్చేసరికి రెండు రోజులు పట్టే ఛాన్స్
VNSఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్, మూడో కన్నుతెరిచానంటే జాగ్రత్త, సినిమాల విషయానికి రావొద్దని హెచ్చరిక
Hazarath Reddyసినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి.
Socio Economic Survey: సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేసిన సీఎం జగన్, ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని తెలిపిన ముఖ్యమంత్రి
Hazarath Reddyశాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు.
AP Weather Forecast: ఏపీలో మార్చి 16 నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Hazarath Reddyఏపీలో బుధవారం నుంచి వర్షాలు మొదలు కానున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే వానలు (Rains in AP) కురవనున్నాయి
Heat Wave in AP: ఏపీ ప్రజలకు వడగాలుల హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు
Hazarath Reddyఏపీలో రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత చాలా అధికంగా ఉండబోతోంది. ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అ­వకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధి­కారులను వి­ప­త్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.
AP Budget Session 2023-24: ప్లకార్డుతో సభలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన, నమ్మకద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని అంబటి రాంబాబు మండిపాటు, కొనసాగుతున్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు.
YS Jagan Attack Case: కోడికత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన ఎన్‌ఐఏ కోర్టు, విచారణ ఏప్రిల్‌ 10కి వాయిదా
Hazarath Reddyగత ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి (YS Jagan Attack Case) జరగడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో(NIA court ) మంగళవారం విచారణ జరిగింది.
Telugu Flag Tweet Row: నాటు నాటు సాంగ్.. సీఎం జగన్ తెలుగు ఫ్లాగ్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyగాయకుడు అద్నాన్ సమీ మళ్లీ జగన్ పై విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ('Naatu Naatu' Wins Oscar) వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
AP Shocker: అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు
Hazarath Reddyకర్నూలు జిల్లా(Kurnool)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య(Son-in-law kills Wife), అత్త, మామల పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు ఓ అల్లుడు.
Kiran Kumar Reddy Quits Congress: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం.
AP Cabinet Approves 15 Bills: 45 అజెండా అంశాలపై చర్చలు, 15 బిల్లులతో పాటు 2023-27 పారిశ్రామిక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, 24 వరకు అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.
AP Budget Session 2023: ఈ నెల 16న అసెంబ్లీకి ఏపీ బడ్జెట్‌, ఈ నెల 24 వరకు మొత్తం 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ అధ్యక్షతన ముగిసిన బీఏసీ సమావేశం
Hazarath Reddyఅసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు.
AP Budget Session 2023-24: అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, అసెంబ్లీలో గవర్నర్ నజీర్ తొలి ప్రసంగం, ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి.
108 Ambulance Catches Fire: వీడియో, అంబులెన్సులో పెద్ద శబ్దంతో పేలిన ఆక్సిజన్ సిలిండర్, ఒకరికి తీవ్ర గాయాలు, కాలిబూడిదైన రూ.40 లక్షల విలువైన పొగాకు నిల్వలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్‌పేటలో రోగిని తరలిస్తున్న అంబులెన్సులో మంటలు చెలరేగి, ఆపై పేలుడు సంభవించిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడడంతోపాటు రూ. 40 లక్షల విలువైన పొగాకు నిల్వలు కాలిబూడిదయ్యాయి.