ఆంధ్ర ప్రదేశ్

H3N2 Virus Spread: హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం, తెలుగు రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్, వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన

Hazarath Reddy

దేశాన్ని కరోనా కుదిపేసిన సంఘటనలు మరువకముందే మరో వైరస్ హెచ్3ఎన్2 భారతదేశాన్ని వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్ జారీ చేసింది.

Janasena 10th Formation Day: నేడు జనసేన 10వ ఆవిర్భావ సభ.. మచిలీపట్నంలో 34 ఎకరాల్లో సభా వేదిక.. ఆటోనగర్ నుంచి వారాహిలో బయల్దేరనున్న పవన్

Rudra

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ వేడుకలు ఈరోజు జరగనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్యక్రమం జరగనుంది. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు.

Telangana Rains: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్

Rudra

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

MLC Election 2023: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది

Advertisement

Perni Nani on Pawan Kalyan: కులాలపై కనీస అవగాహన లేని సన్నాసి పవన్‌, మరో ఏడాదిలో అన్ని రంగులు బయటపడతాయని పేర్ని నాని విమర్శలు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని మరోసారి విరుచుకుపడ్డారు. కాపులందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ ఎంతో చేశారని, అందుకే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు.

AP Budget 2023-24: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, ఈ నెల 18న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ 2023-24 సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, మండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి.

Oscars 2023: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా రెపరెపలాడింది, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

Hazarath Reddy

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది.

MLC Elections Polling: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 9 స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని 9 జిల్లాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో పోలింగ్ మొదలైంది.

Advertisement

Kiran Kumar Reddy Resigns: కాంగ్రెస్‌కు మాజీ సీఎం గుడ్‌బై, ఏఐసీసీకి రాజీనామా లేఖ, కాషాయ గూటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, త్వరలోనే కీలక బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌

VNS

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar reddy).. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు (resigns congress). కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో (BJP) చేరనున్నారని సమాచారం.

Cases Raises Again: మళ్లీ మొదలైన ఆందోళన.. పెరుగుతున్న కొవిడ్, హెచ్3ఎన్2 కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన

Rudra

మళ్లీ కలవరం మొదలైంది. దేశంలో కొవిడ్ తో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఉపరకం హెచ్3ఎన్2 కేసులు కూడా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది.

CID Raids On Margadarsi Chit Fund: ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ తనిఖీలు

Rudra

మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ సోదాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.

Kiran kumar reddy: బీజేపీలో చేరనున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రెండు, మూడు రోజుల్లో ప్రకటన.. కిరణ్ కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం

Rudra

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలోకి చేరడానికి సిద్ధమైనట్టు చెపుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టు సమాచారం.

Advertisement

SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్

Rudra

ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.

Headmaster Misbehave with Students: ఒంటిపై పుట్టుమచ్చలు చూపించాలంటూ బాలికలతో హెడ్‌మాస్టర్ కీచక చర్యలు, సత్యసాయి జిల్లాలో బయటపడ్డ ప్రధానోపాధ్యాయుడి వికృతాలు

VNS

సత్యసాయి జిల్లాలో ఓ ప్రధానో పాధ్యాయుడి (headmaster) కీచక పర్వం ఆసల్యంగా బయటపడింది. తనకల్లు మండలం నల్లగుట్లపల్లి జల్లాపరిషత్‌ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ..పాఠశాలలో బాలికలకు గత కొద్దిరోజులుగా నరకం చూపిస్తున్నాడు. ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు…వికృత చేష్టలను (misbehave with girl students) భరిస్తూ.. చాలాకాలంగా విద్యార్థినులు తమలో తామే కుమిలిపోయారు.

Tiger Cubs Shifted to SVZ Park: కానరాని తల్లి జాడ, శ్రీవెంకటేశ్వర జువాలాజికల్‌ పార్కుకు తరలి వెళ్లిన నాలుగు పులి కూనలు, ఆరోగ్యంగా చలాకీగా ఉన్న పిల్లలు

Hazarath Reddy

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్‌ పార్కుకు తరలించారు.ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్‌–శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, ఎంపీ అవినాష్ రెడ్డిపై అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్‌ డిస్క్‌ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Kavita Nirasana Deeksha: జంతర్‌మంతర్‌లో ఉదయం 10 గంటలకు కవిత నిరసన దీక్ష షురూ.. ప్రారంభించనున్న సీతారాం ఏచూరి.. పూర్తి వివరాలు.. వీడియోతో

Rudra

భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది.

H3N2 Influenza: హెచ్3ఎన్2 వైరస్ అంటే ఏంటి? అది సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి?

Rudra

మొన్నటి వరకూ కరోనాతో కుదేలైన ప్రజలను మరో వైరస్ భయపెడుతుంది. వేసవికాలంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ రకం కేసులు పెరుగుతున్నాయి.

Ragi Malt Programme Postponed: పాఠశాల విద్యార్థులకు ‘రాగిజావ’ కార్యక్రమం రెండోసారీ వాయిదా.. జగనన్న గోరుముద్ద ద్వారా 21 నుంచి అందించాలని తాజాగా నిర్ణయం.. వాయిదాకు కారణం ఏంటంటే?

Rudra

మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్దలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలనుకున్న రాగిజావ పథకం రెండోసారి వాయిదా పడింది.

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, సీబీఐ విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Hazarath Reddy

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని పిటిషన్‌లో కడప ఎంపీ ( MP Avinash Reddy) కోరారు.

Advertisement
Advertisement