ఆంధ్ర ప్రదేశ్

Skill Development Scam: దేశంలోనే అతి పెద్ద స్కాం, స్కిల్‌ డెవలప్మెంట్‌ పేరుతో రూ.371 కోట్లు కాజేశారు, గత ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం అతిపెద్దదని స్పష్టం​ చేశారు.

TDP Leaders Attack On Speaker: వీడియో ఇదిగో, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడి, అడ్డు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా దాడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏడో రోజున రభస నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్‌ చైర్‌ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు

RGV Vs VH: "ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ.. ‘మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్

Rudra

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ సెటైరికల్ గా తిప్పికొట్టారు.

Corona Alert: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో 1,071 కేసులు.. 130 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.. మొత్తంగా 5,915కు పెరిగిన యాక్టివ్ కేసులు.. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి మృతి

Rudra

గడిచిన మూడేండ్లుగా యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించి ఇటీవల శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 130 రోజుల తర్వాత ఒక్క రోజే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి.

Advertisement

Mobile Phone Explodes: ప్యాంటు జేబులోనే బాంబులా పేలిన సెల్‌ఫోన్, వ్యక్తికి తీవ్రగాయాలు, ఇంతకీ మొబైల్ ఎందుకు పేలిందంటే?

VNS

నంద్యాల జిల్లా డోన్ లో సెల్ ఫోన్ పేలుడు (Mobile Phone Explodes) ఘటన కలకలం రేపింది. వివో సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వ్యక్తి చేతికి, తొడకి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్ నగర్ కాలనీకి చెందిన నాగేంద్ర.. పాత బస్టాండ్ దగ్గర టీ తాగాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. టీచర్స్ కాలనీలోని శారదా కాన్వెంట్ దగ్గరికి రాగానే ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది.

Andhra Pradesh Rains: ఏపీలో మరో 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం, వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని ఆదేశాలు

Hazarath Reddy

రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వీడియోతో

Rudra

కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

Telangana SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు

Rudra

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Advertisement

Bharat Gaurav Rail: సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ‘భారత్ గౌరవ్’ రైలు.. రైలును జెండా ఊపి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్.. 8 రాత్రుళ్లు, 9 పగళ్లు పూరి, కోణార్క్, గయ, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను చుట్టనున్న రైలు

Rudra

సికింద్రాబాద్ నుంచి తొలిసారి ఓ ‘భారత్ గౌరవ్’ రైలు బయలుదేరింది. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఉద్దేశించిన ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.

IND Vs AUS: విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం.. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. రెండో వన్డేపై నీలినీడలు.. మ్యాచ్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం

Rudra

గత మూడు రోజులుగా వర్షంతో తడిసి ముద్దైన విశాఖపట్టణంలో నేడు కూడా వర్షం కురుస్తున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు నగరంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

AP MLC Election Result 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ, మూడుస్థానాల్లోనూ విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధులు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్‌లో ఉత్కంఠ, రీ కౌంటింగ్ పట్టుబట్టిన వైసీపీ

VNS

ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ (కడప – అనంతపురము – కర్నూలు) (Rayalaseema East Graduate Constituency Election) ఎమ్మెల్సీగా.. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి (Bhumi Reddy Ram Gopal Reddy) గెలుపొందారు.

Heavy Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, నగరాన్ని కమ్మేసిన కారుమబ్బులు, భారీగా ట్రాఫిక్ జామ్, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటూ భారీ వర్షాలున్నాయంటూ ఐఎండీ హెచ్చరిక

VNS

హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం (heavy rain) కురిసింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Advertisement

Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం.. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి

Rudra

తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Khammam: పెళ్లి ఇంట్లో చావుమేళం, రాత్రి కూతురు పెళ్లి ఉండగా ఉదయమే చనిపోయిన తండ్రి, ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన

VNS

పెళ్లి సంబురంతో వచ్చిన బంధువులు, చావు మిగిల్చిన దుఃఖంతో వెళ్లిపోయారు. మరికొన్ని గంటల్లో బిడ్డ పెళ్లి జరగాల్సిన ఇంట్లో.. గుండెపోటు (Heart attack)తో తండ్రి హఠాన్మరణం పాలయ్యాడు. ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది.

MLC Election Result: తగ్గని వైఎస్ జగన్ మేనియా, 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్, తెలంగాణలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (MLC Election Result) విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections Results) ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, ప్రస్తావనకు వచ్చిన కీలక అంశాలు ఇవే, అనంతరం హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో సీఎం జగన్‌ చర్చించారు.

Advertisement

Kakinada Shocker: వీడియో ఇదిగో, కాకినాడలో నడిరోడ్డుపై ఇన్స్‌స్పెక్టర్‌ని కత్తితో నరికిన వ్యాపారి, తెగిపడిన పోలీస్ చేతి వేళ్లు, పరిస్థితి విషమం

Hazarath Reddy

కాకినాడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్‌పై కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గాప్రసాద్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి తెగబడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌పైనా దాడికి యత్నించాడు.

AP Budget 2023: గతేడాది ఏపీ అప్పులు భారీగా తగ్గాయి, ద్రవ్య లోటు అదుపులోకి వచ్చిందని తెలిపిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఖరారు చేసిన అకౌంట్స్‌ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో (financial year 2021-22) ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా వెల్లడించారు.

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం, అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కూడా సమావేశం కానున్నారు. సీఎం జగన్‌ గురు­వారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

Hair Offering Ticket Price Hike: ఏపీ ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర పెంపు.. ప్రస్తుత రూ. 25 నుంచి రూ. 40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ.. క్షురకులకు గుడ్ న్యూస్.. నెలకు కనీసం రూ. 20వేల కమిషన్ ఇచ్చేలా ప్రభుత్వ ఉత్తర్వులు

Rudra

దేవాదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు శుభవార్త చెప్పింది.

Advertisement
Advertisement