ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: జగన్ సర్కారు గుడ్ న్యూస్, ఇక నుంచి పింఛన్‌ను ఓ చోటు నుంచి మరొక చోటుకి మార్చుకోవచ్చు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది.

CM Jagan in Action: సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ, మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. సీఎం జగన్ మాట్లాడుతూ..స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ జరగాలన్నారు.

Andhra Pradesh: ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పిన న్యూస్ క్లిప్స్ వైరల్, విజయవాడలో ఎక్కడ చూసినా అవే..

Hazarath Reddy

ఏపీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయాలు వేడెక్కిన సంగతి విదితమే. తాజాగా విజయవాడలో చంద్రబాబుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు..ఎన్టీఆర్ మాకు అవసరం లేదని చెప్పినట్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ కథనం రాసింది.

Three Capitals Row: 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు, అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేముందని ఆయన అన్నారు. యాత్రలను అడ్డుకోవడం తమకు ఐదు నిమిషాల పని అని చెప్పారు.

Advertisement

Minister Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్ అన్న ముందు కాదు, బాలయ్యపై ఏపీ మంత్రి రోజా ట్వీట్..

kanha

ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్ ముందు కాదంటూ ఏపీ మంత్రి రోజా సెటైర్‌ వేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.

Kakinada Shocker: మా అమ్మను నాన్న ఇలా గొంతు నొక్కి చంపాడు, కాకినాడ వివాహిత హత్యకేసులో తండ్రే హంతకుడని కూతురు వాంగ్మూలం, బిడ్డ నల్లగా పుట్టిందని అనుమానంతోనే చంపినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ, మూర్చవచ్చి చనిపోయిందని నమ్మించేయత్నం

Naresh. VNS

ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిర్వహించి, దహన సంస్కారాలు పూర్తిచేశారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారిని తమతో కారాగావ్‌ (Karagav) తీసుకొచ్చారు.

Fire Accident: రేణిగుంటలో అగ్నిప్రమాదం.. వైద్యుడి సజీవదహనం.. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి..

Jai K

తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ దుర్ఘటనలో వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అతడి కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.

Raithu Padayatra: రైతుల పాదయాత్రకు మద్దతుగా వస్తే తొక్కేస్తా.. అయ్యన్నపాత్రుడిని హెచ్చరించిన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్

Jai K

అమరావతి రైతుల పాదయాత్రపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తీవ్రంగా మండిపడ్డారు. అరసవల్లి సూర్యభగవానుడి దర్శనానికి కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్లాలని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. కానీ పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

Vijayawada Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారికి చేసే అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు మీ కోసం..

Krishna

Vijayawada Kanaka Durga: సెప్టెంబర్ 25 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

Jogi Ramesh Slams Balakrishna: ఎన్టీఆర్ కొడుకులు పరమశుంఠలు, ఎన్టీఆర్ చివరి కోరికను తీర్చలేని దద్దమ్మలు, బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం, మూడు రోజుల తర్వాత నిద్రలేచాడంటూ బాలకృష్ణపై ఘాటువ్యాఖ్యలు

Naresh. VNS

బాలకృష్ణ (balakrishna) మూడు రోజుల తరువాత స్పృహలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. జాతికి, సమాజానికి ఎన్టీఆర్ ని ఎవరు దూరం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? అని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని చంద్రబాబుని (Chandra babu) సీఎం సీటులో కూర్చోవడానికి నువ్వేమి చేశావు? అంటూ బాలకృష్ణని ప్రశ్నించారు.

Andhra Pradesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువ, యూరప్ ఎక్స్‌పో 2022లో ఏపీకి భారీ ఆర్డర్, ఆంధ్రాలో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 11 టాప్ గ్లోబల్ కంపెనీలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) చైర్మన్ ఎ వరప్రసాద్ రెడ్డి 11 గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో ₹ 550 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను రిక్రియేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చొరవలో ఈ కంపెనీలు భాగం కానున్నాయి.

Vizag Harbor: మత్స్యకారుల ఆందోళన... విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్.. భారీగా మోహరించిన పోలీసులు

Jai K

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్ ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు నౌకలు వచ్చే మార్గంలో బోట్లను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదని... హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

YS Sharmila: ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల ధ్వజం.. ఎన్టీఆర్‌తో పాటు కోట్ల మందిని అవమానించినట్లేనని మండిపాటు

Jai K

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుందని అన్నారు.

Weather Forecast: విశాఖను కుమ్మేసిన భారీ వర్షం, మరో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తున్నాయి. విశాఖలో ఈ రోజు మధ్యాహ్నం బలమైన గాలులుతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసింది. ఇదిలా ఉంటే అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన (IMD Issues Rain Alert) చేసింది.

CM Jagan Speech in Kuppam: ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం, భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా మీకు అందిస్తా, కుప్పం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్

Hazarath Reddy

కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగింది. వైఎస్సార్ చూయూత మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌. రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ చేశారు,

YSR Cheyutha Scheme: మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల, రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ

Hazarath Reddy

కుప్పం పర్యటనలో సీఎం జగన్ మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేశారు.వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌.

Advertisement

CM Jagan Speech in Kuppam:సున్నా వడ్డీ పథకానికి రూ. 3, 615 కోట్లు, డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ చేశామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

కుప్పంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. .డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ. సున్నా వడ్డీ పథకానికి రూ. 3, 615 కోట్లు అందించాం. నాలుగు పథకాలకు 39 నెల్లలో 51 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు.

CM Jagan Speech in Kuppam: నా కుప్పం అక్కా చెళ్లెళ్లు అంటూ జగన్ స్పీచ్, కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు,కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కుప్పం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు.. కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధని సీఎం జగన్ అన్నారు

Andhra pradesh: కుప్పం వేదికగా సీఎం జగన్ గుడ్ న్యూస్, జనవరి నుంచి రూ. 2750కు పెన్షన్‌ పెంపు, 3 వేల వరకూ పెంచుతామన్న హామీని నెరవేరుస్తామని తెలిపిన సీఎం

Hazarath Reddy

మరో మంచి కార్యక్రమానికి కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుప్పం అంటే ఈరోజు నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లో అభివృద్ధి కనిపిస్తోంది. కుప్పం అంటే ఈరోజు చంద్రబాబు పాలన కాదు.. కుప్పం అంటే ఈరోజు అక్కాచెల్లెమ్మల అభివృద్ధి. జనవరి నుంచి పెన్షన్‌ పెంపు. జనవరి నుంచి రూ. 2750కు పెన్షన్‌ పెంపు. 3 వేల వరకూ పెంచుతామన్న హామీని నెరవేరుస్తామని సీఎం అన్నారు.

CM Jagan Kuppam Tour: కుప్పంలో తొలిసారిగా సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్, వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటన కోసం (CM Jagan Kuppam Tour) తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్‌. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం (CM YS Jagan's first public meeting) ఇదే మొదటిసారి.

Advertisement
Advertisement