ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: సీఎం జగన్ రుణం తీర్చుకోలేమంటున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు, 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపిన సంగతి విదితమే. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సీఎం (CM YS Jagan Mohan Reddy) సంతకం చేశారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి వివ‌రించారు.
Andhra Pradesh: రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి, అధికారులకు సూచించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Hazarath Reddyఏపీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు (complete the construction of roads) తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్‌ (CM YS Jagan directs officials) సమీక్షించారు.
Andhra Pradesh: ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి, ఊపిరి పీల్చుకున్న వజ్రపుకొత్తూరు వాసులు, మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి దాన్ని సజీవంగా పట్టుకున్న రెస్క్యూ టీమ్‌
Hazarath Reddyఏపీలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి లో నిన్న పలువురిపై దాడి చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు (Rescue team catches Bear) చిక్కింది. ఆ ఎలుగబంటిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చిన రెస్క్యూ టీమ్‌.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది.
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాను వణికిస్తున్న ఎలుగుబంటి, దాడిలో ఒకరు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Hazarath Reddyఏపీలో గత కొన్ని రోజులు నుంచి శ్రీకాకుళం జిల్లా వాసులు ( Srikakulam) ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది.
Andhra Pradesh Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిద్రమత్తులో కల్వర్టును ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు, 22 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
Hazarath Reddyఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది (22 injured in bus accident) గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
Dhulipalla Narendra Arrested: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, చలో అనుమర్లపూడికి అనుమతి లేదని తెలిపిన పోలీసులు, గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని స్పష్టం
Hazarath Reddyటీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని స్పష్టం చేశారు.
AP Inter Results 2022: పుకార్లకు చెక్.. జూన్ 25 తర్వాతే ఇంటర్ పరీక్షా ఫలితాలు, స్పష్టతనిచ్చిన ఇంటర్‌ బోర్డు, వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజు వస్తున్నాయి, రేపు వస్తున్నాయంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదలపై (AP Inter Results 2022) పూర్తి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు (Board of Intermediate Education Andhra Pradesh) స్పష్టత ఇచ్చింది.
Secunderabad Violence Suspect In Custody: సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి అరెస్ట్, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తింపు, రహస్య ప్రాంతంలో దర్యాప్తు, నర్సరావుపేటలో డిఫెన్స్ అకాడమీ నడుపుతున్న అనుమానితుడు
Naresh. VNSఈ కేసులో దాడులకు ప్రధాన సూత్రధారిగా సాయి డిఫెన్స్ అకాడమీ (Sai Defense Academy) డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని (Subbarao) అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సుబ్బారావుని అరెస్ట్ చేసిన నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
AP Inter Result 2022: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు, ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం, ఫలితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ రోజే వెలువడనున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై (AP Inter Result 2022) ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కావున ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ED Raids: జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలన
Hazarath Reddyఅనంతపురం జిల్లా తాడాపత్రిలో ఉన్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు (ENFORCEMENT DIRECTORATE) తనిఖీలు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు.
Jobs in Singareni: సింగరేణిలో కొలువుల జాతర, 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ, ఈ జిల్లాల వారికి బంపర్ ఆఫర్, పోస్టుల్లో 95 శాతం వాళ్లకే, దరఖాస్తు చేసుకునే పద్దతి ఇదే!
Naresh. VNSసింగరేణి (Singareni) యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ (Sridhar) ఆదేశించారు. నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.
Liquor Destroyed in AP: ఈ సారి ఒంగోలులో.., రూ.2.14 కోట్ల విలువైన మద్యంను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు, వివరాలను వెల్లడించిన ఎస్పీ మలికాగర్గ్‌
Hazarath Reddyఈ సారి ప్రకాశంలో లిక్కర్ ధ్వంసం జరిగింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్‌ సమక్షంలో ధ్వంసం ( Liquor Destroyed in AP) చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం (destroyed in Prakasam) కార్యక్రమాన్ని నిర్వహించారు.
Case Against Sai Pallavi: నటి సాయి పల్లవిపై పోలీసు కేసు నమోదు, విరాట పర్వం మూవీని అడ్డుకుంటామంటూ భజరంగ్ దళ్ హెచ్చరిక, అసలు సాయి పల్లవిపై కేసు ఎందుకు పెట్టారో తెలుసా?
Naresh. VNSఈ బ్యూటీకి ఇప్పుడు ఓ దిమ్మతిరిగే షాకిచ్చారు భజరంగ్‌దళ్‌(Bajarangdal) నాయకులు. ఇటీవల విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai pallavi)కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా భజరంగ్‌దళ్‌ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Andhra Pradesh: మేము కంపెనీ సెక్రటరీలం కాదు, హైకోర్టు జడ్జీలం, రఘురామకృష్ణరాజు పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని వెల్లడి
Hazarath Reddyఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు (AP High court) మొటిక్కాయలు వేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది.
AP 10th Class Betterment Exams: పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు, బెటర్‌మెంట్‌ ద్వారా మార్కులను పెంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల (AP 10th Class Exams) సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది
Andhra Pradesh: జగన్ మరో కీలక నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై టెక్నాలజీ విద్య, బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు.
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌, ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyసీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌ దక్కింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ సీనియర్ ఐపిఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును (AB Venkateswara Rao) ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా (Commissioner of Printing, Stationery) రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది.
CM YS Jagan Review: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, బైజూస్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జగన్ సర్కారు
Hazarath Reddyప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్‌ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు.
Andhra Pradesh Shocker: నెల్లూరు జిల్లాలో దారుణం, క్షుద్ర పూజల పేరుతో పిల్లలను చంపేందుకు తండ్రి ప్రయత్నం, చికిత్స పొందుతూ బాలిక మృతి
Hazarath Reddyదేవుడిని అయిపోవాలనే మూఢనమ్మకంతో ముక్కుపచ్చలారని నాలుగేళ్ల కన్నబిడ్డ నోట్లో కుంకుమ పోసి తనకు తెలిసిన పిచ్చి పిచ్చి పూజల్నీ చేశాడు తండ్రి వేణు. ఈ క్రమంలో బిడ్డ ఊపిరి ఆడక కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న స్థానికులు వేణు ఇంటికొచ్చి జరిగింది చూశారు.
Andhra Pradesh: మద్యం ప్రియులు గుండెలు బాదుకునే న్యూస్, రూ. 92 లక్షల విలువ గల 8800 బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లాలో ఘటన
Hazarath Reddyమద్యం ప్రియులు కచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే ఇది. కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు. తమ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని సీజ్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇలా ధ్వంసం (crushed under road Roller) చేశారు.