ఆంధ్ర ప్రదేశ్

Cyclone In AP: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ వ‌ర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వ‌ర్షాలు, తిరుమ‌ల శ్రీ‌వారి మెట్టుమార్గం మూసివేత‌

VNS

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది.

Andhra Pradesh Rains: నెల్లూరుకు దగ్గరగా వచ్చిన వాయుగుండం, రేపు తీరం దాటే అవకాశం, రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.

Vijaya Dairy Chairman Jagan Mohan Reddy: అఖిల ప్రియ రౌడీ రాజకీయానికి భయపడం, చంద్రబాబు మెప్పుకోసమే కొత్త నాటకాలు అని విజయ డైరీ ఛైర్మన్ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపాటు

Arun Charagonda

నంద్యాల జిల్లా విజయ డైరీలో భూమా అఖిల ప్రియ చేసిన హంగామా పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీ అన్నది స్వతంత్ర సంస్థ అన్న విషయం కూడా అఖిలప్రియ మర్చిపోయిందన్నారు. అఖిలప్రియ రౌడీ రాజకీ యానికి ఇక్కడ భయప డేవారు లేరు అన్నారు.

Hanuman Temple Vandalized: వీడియో ఇదిగో, చిత్తూరు జిల్లాలో ఆంజేనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు.

Advertisement

APSRTC Driver Dies of Heart Attack: చీరాలలో తీవ్ర విషాదం, బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు, పొలాలలోకి దూసుకెళ్లిన బస్సు, డ్రైవర్ మృతి

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Tirupati: శవాన్ని దహనం చేయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా, తిరుపతి జిల్లాలో ఆ ఊరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులా...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుపతి జిల్లా సత్యవేడు :ప్రాణాలకు తెగించినా పట్టించుకోవడం లేదు అధికార యంత్రాంగం. వర్షా కాలంలో చని పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు...స్మశానానికి వెళ్లాలంటే అరునానది సమీపంలోనీ కాలువలో ఈదుకుంటూ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైనా ఆ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీర్చే నాయకుడే లేకుండా పోయాడని వాపోతున్నారు ప్రజలు.

Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు

Hazarath Reddy

ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Telangana Govt Relieved IAS Officers: ఆ ఐదుగురు ఐఏఎస్ ల‌ను రిలీవ్ చేసిన రేవంత్ స‌ర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌నున్న ఐఏఎస్ లు

VNS

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి (Amrapali), రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి కరణ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ లను కేంద్ర ఉత్తర్వులు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్ లను రివీవ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీవోపీటీ (DOPT) ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.

Advertisement

Private Liquor Shops in AP: ఏపీలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ మ‌ద్యం షాపులు ప్రారంభం, కోరుకున్న బ్రాండ్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్దం, వారం పాటూ తాత్కాలిక లైసెన్స్ ఇచ్చిన స‌ర్కార్

VNS

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో (Andhra Pradesh) ఇవాల్టి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు (Private liquor shops) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని దక్కించుకున్న వారు.. నేటి నుంచే వ్యాపారం మొదలు పెట్టనున్నారు. వారంతా తొలి విడత లైసెన్సు రుసుముల కింద ప్రభుత్వానికి రూ.330 కోట్లు చెల్లించారు.

YS Jagan: వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..

Hazarath Reddy

బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Kakani on Jamili Elections: చంద్రబాబు ప్రభుత్వం ఉండేది రెండేళ్లే, జమిలీ ఎన్నికలు వస్తే ఇంటికి వెళ్ళక తప్పదని తెలిపిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేతలు చెప్పినట్టుగా చేయవద్దని అధికారులకు హెచ్చరిక

Hazarath Reddy

జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు

Weather Forecast: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు, పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్, నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.

Advertisement

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసుపై స్పందించిన ఏపీ డీజీపీ, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వెల్లడి

Hazarath Reddy

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

New Liquor Policy in AP: బాబోయ్.. విశాఖలో 155 మద్యం షాపులకు అప్లికేషన్లు వేసిన ఢిల్లీ వ్యాపారి, దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు, ఇంతకీ ఆయనకు దక్కిన షాపులు ఎన్నంటే..

Hazarath Reddy

విశాఖ జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా..తాజాగా ఢిల్లీకి చెందిన లిక్కర్‌ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఏకంగా 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు.

New Liquor Policy in AP: నేటితో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత, రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు అందుబాటులోకి, రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు నేటితో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Rudra

దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

Advertisement

Goddess Saraswathi Idol Vandalized: ఏపీలోని ప్రత్తిపాడులో ఘోరం.. విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆకతాయిలు (వీడియో)

Rudra

ఏపీలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన కొందరు దుండగులు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు పూజించే సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్‌ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.

New Liquor Policy in AP: ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ, లిక్కర్ షాపులను దక్కించుకున్న మహిళలు, అక్టోబర్ 16 నుంచి కొత్త షాప్‌లో మద్యం అమ్మకాలు

Hazarath Reddy

ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797. 64 కోట్ల ఆదాయం సమకూరింది

Chiranjeevi Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి...వరద సాయం చెక్కు చంద్రబాబుకు అందజేత...

sajaya

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

Advertisement
Advertisement