ఆంధ్ర ప్రదేశ్

Saddula Bathukamma Celebrations: తెలంగాణ‌లో వాడ‌వాడ‌లా స‌ద్దుల బ‌తుక‌మ్మ కోలాహ‌లం, ట్యాంక్ బండ్ పై 10వేల మందితో ఉత్స‌వాలు, ఆక‌ట్టుకున్న క్రాక‌ర్ షో

VNS

ఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు (saddula Bathukamma Celebration).. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు

Andhra Pradesh: 100 కోట్ల స్కాం,చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో సీఐడీ తనిఖీలు, బ్యాంకు వద్ద కట్టుదిట్టమైన భద్రత

Arun Charagonda

రూ.100 కోట్ల స్కాంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో చిల‌క‌లూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో తనిఖీలు చేశారు పోలీసులు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు సంబంధించి 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీతో దర్యాప్తు చేయించి, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు .ఈ నేపథ్యంలో సీఐడీ తనిఖీలు చేపట్టింది.

Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ

Andhra Pradesh: సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు.

Advertisement

Ratan Tata Dies: నేడు ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రతన్ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న ఇరువురు, టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Ratan Tata Dies: దేశ పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్, రతన్‌ టాటా మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ చావల్‌ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Nandigam Suresh: నందిగం సురేష్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్...గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు నోటీసులు

Arun Charagonda

తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్‌. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

YouTuber Dasari Vigyan: యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, మార్ఫిండ్ వీడియోలతో వేధిస్తున్నట్లు కంప్లైంట్

Arun Charagonda

యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ స‌మావేశం, ద‌స‌రా, దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించే దిశగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం

VNS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు

Hazarath Reddy

రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.

Navratri Celebration: వీడియో ఇదిగో, రూ. 3.33 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారు, నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

స్థానికంగా "నిద్ర గన్నేరు చెట్టు" అని పిలవబడే 150 సంవత్సరాల పురాతన చెట్టు ఇది. 300కు పైగా దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలలో కనిపించినందుకు "సినిమా ట్రీ" గా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది వరదల కారణంగా నేలకూలిన తర్వాత పునరుద్ధరణ సంకేతాలను చూపుతోంది

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు, సాధారణ అనస్థీషియా లేకుండా ఆపరేషన్

Hazarath Reddy

రాజాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

YS Jagan On Good Book: రెడ్ బుక్ కాదు గుడ్‌ బుక్ పెడదాం...ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలన్న జగన్, కష్టాల్లో నుండే నాయకులు పుడతారని ధైర్యం నింపిన జగన్

Arun Charagonda

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు మనం గుడ్ బుక్ పెడదాం అని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జగన్. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు.

Andhra Pradesh Shocker: ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

BJP Leader Video Call Leaked: చిక్కుల్లో గుంటూరు జిల్లా బీజేపీ నేత, ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ రేపు వస్తావా అంటూ పచ్చిబూతులు..వీడియో వైరల్

Arun Charagonda

బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్‌ సోషల్‌ మీడియా సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్‌ లో మాట్లాడుతూ ‘రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం అంటూ చేసిన అసభ్యకర లీక్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Cyber Fraud In Andhra Pradesh: డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..డ్రగ్స్ మాఫియా పేరుతో రూ. 2 కోట్లు స్వాహా..

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా డాక్టర్‌నే బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అమీన్ ఆసుపత్రి వైద్యుడు ఇంతియాజ్‌కు పోలీసు అధికారి ఫొటో కలిగిన నంబరు నుంచి ఐదు నెలల క్రితం ఫోన్ వచ్చింది.

Pawan Kalyan At Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సరస్వతీ దేవీ అవతారంలో దుర్గమ్మ, ప్రత్యేక పూజలు చేసిన పవన్

Arun Charagonda

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్నారు పవన్. అనంతరం ప్రత్యేక పూజలు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని లక్షలాదిగా దర్శించుకోనున్నారు భక్తులు.

Disciplinary Action On PV Sunil: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై వేటు, ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో జారీ

Arun Charagonda

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై వేటు వేసింది ఏపీ ప్ర‌భుత్వం. సాధారణ పరిపాలనాశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబ‌ర్ 1695 జారీ చేసింది.

FSSAI Lab At Tirumala: తిరుమలలో FSSAI ల్యాబ్, ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం,22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి సత్యకుమార్

Arun Charagonda

తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయ‌నుంది FSSAI. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క‌ర్నూలులో రూ.40 కోట్ల‌తో స‌మ‌గ్ర ఆహార ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాలను పెంచేందుకు 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు...ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల చ‌ట్టం అమ‌లుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్లడించారు మంత్రి.

Advertisement
Advertisement