Chandra Babu Road Show (Photo-Video Grab)

Nellore, Dec 29: ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో ప్రధాని తీవ్రంగా కలత చెందినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.

మృతుల కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ (ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం 8 మంది మృతిచెందగా.. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇరుకు సందే కొంప ముంచింది, రోడ్డు చిన్నగా ఉండటంతో భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో తోపులాట, విషాదంగా మారిన చంద్రబాబు రోడ్ షో, ఏడు మంది మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్‌ 174 కింద కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చనున్నారు.

చంద్రబాబు నాయుడు రోడ్ షోలో అపశృతి, డ్రైనేజీలో పడిపోయిన కార్యకర్తలు, ఏడుమంది మృతి, మరికొందరికి గాయాలు, మృతుల కుటుంబాలకు టీడీపీ పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం

కందుకూరులో చంద్రబాబు పర్యటనలో తొక్కిసలాట జరిగి, మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున సాయం అందిస్తామని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బేబినాయన, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులు ప్రకటించారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.

Here's PMO Tweet

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నెల్లూరు బహిరంగ సభ దుర్ఘటన చాలా దురదృష్టకరని కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Shivanath)అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన కుటుంబాలకు కేశినేని ఫౌండేషన్ తరపున ఒక్కొక్కరికి రూ.50,000, గాయపడిన ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.