
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద (6) ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.
వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు వివేకానంద అందులో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకునేలోపే వివేకానంద నీటిలో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే.
హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. సోమవారం పెట్రోలింగ్‌లో ఉన్న లేక్ పోలీసులకు సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఆర్‌ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి 25నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని ఒంటిపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.