తెలంగాణ

Cyber Crime: అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన

Arun Charagonda

అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది. తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో

Arun Charagonda

మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.

Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో

Arun Charagonda

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.

Hyderabad: ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్

Arun Charagonda

హైదరాబాద్ ఆర్ధిక ఇబ్బందులతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు గోపాలాపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహరాజు.

Advertisement

Telangana Rains Updates: రెయిన్ అలర్ట్..తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్!

Arun Charagonda

తెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు

Rudra

హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.

Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!

Rudra

చిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.

Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్‌ బాగ్‌ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Advertisement

Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని దిల్‌ సుఖ్‌ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.

Tirumala Srivari Laddu: హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

Rudra

ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.

Jailer Villain Arrested: జైల‌ర్ విల‌న్ మ‌రోసారి అరెస్ట్, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు (వీడియో ఇదుగోండి)

VNS

జైలర్‌ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Deepthi Jeevanji: పారాలంపియ‌న్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫ‌ర్, కోటి రూపాయ‌ల న‌గ‌దు, గ్రూప్-2 ఉద్యోగం ప్ర‌క‌ట‌న‌

VNS

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Advertisement

Whiskey Ice Cream Racket Busted: అక్క‌డ అమ్మేది చాకొలెట్ ఐస్ క్రీం కాదు, విస్కీ ఐస్ క్రీం! జూబ్లీహిల్స్ లో ముఠా అరెస్ట్, పార్టీ ఆర్డ‌ర్ కోసం ఏకంగా 23 కేజీలు రెడీ చేసిన అరికో కెఫే

VNS

పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు (Drugs) వెత్తుక్కుంటున్నారు. చివరికి చిన్న పిల్లలు ఎక్కువగాతినే ఐస్ క్రీములను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ (Whiskey Ice Cream) కలిపి విక్రయిస్తున్న మత్తుదందా గుట్టురట్టయింది

Jaggareddy Sensational Comments: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, ఎమ్మెల్యే - ఎంపీ కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే, వీడియో వైరల్

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలని..సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్‌చెరు ఎమ్మెల్యే సీటుకి 100కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. కులాలతో రాజకీయం నడుస్తలేదు పైసలతో నడుస్తుందని వెల్లడించారు.

Fire Accident At Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం, ఓ కంపెనీలో చెలరేగిన మంటలు..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Lord Ganesh Idol With Bamboo: వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగుతో వినాయకుడిని తయారు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ వెదురుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డానని చెప్పారు.

Advertisement

CM Revanth Reddy On Ganesh Pandals: ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ, ఉత్సవ కమిటీపై అభినందనలు, గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్ అని వెల్లడి

Arun Charagonda

ఖైరతాబాద్‌ గణేశుడికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ అందించాం అని తెలిపారు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్పారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.

Khairtabad Ganesh: 70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Arun Charagonda

తెలంగాణ బడా గణేశ్‌ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయగా 70 అడుగులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Heavy Rains In Sangareddy: సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.

CM Revanth Reddy At Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..

Arun Charagonda

ఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు.

Advertisement
Advertisement