తెలంగాణ
Hyderabad Shocker: జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠా అరెస్ట్, నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టమర్లలాగ వచ్చి దోపిడి
Arun Charagondaహైదరాబాద్ జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. బంగారు దుకాణాల్లో యజమాని,షాప్ సిబ్బంది దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్నారు మహిళలు. కార్లలో వచ్చి కస్టమర్ల లాగా నటిస్తూ దోపిడీ చేస్తున్న ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు. జోడిమెట్ల, చైతన్యపూరి ,జగద్గిరిగుట్టలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.
Telangana: ఆదివాసి యువతిపై అత్యాచారయత్నం, గాయపడ్డ బాధితురాలిని పరామర్శించిన మంత్రి సీతక్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రస్తుతం బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోవా లిక్కర్ స్వాధీనం, 12 లక్షల విలువ చేసే 415 బాటిళ్లు సీజ్
Arun Charagondaగోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.నాన్ డ్యూటీ మద్యాన్ని తరిలిస్తున్న12 మందిపై కేసు నమోదు చేశారు.
Communal Tensions Erupt in Asifabad: ఆదివాసీ యువతిపై అత్యాచారయత్నం, ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు, 144వ సెక్షన్ విధింపు
Hazarath Reddyకొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు.
CM Revanth Reddy On Global AI Summit: హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు, ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు
Arun Charagondaహైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ సదస్సు జరగనుంది.
Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని 2 వేల మంది విద్యార్థుల నిరసన
Arun Charagondaబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.
Money Fraud In Hyderabad: హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ మోసం, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి, అధిక వడ్డీ ఆశతో డబ్బులు వసూలు, బోర్డు తిప్పేసిన కంపెనీ
Arun Charagondaహైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలను ముంచేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ. ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. రెండు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువ కావడంతో మాదాపూర్‌లోని ఆఫీసుకి తాళం వేసి.. పరారయ్యారు . హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు
Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్, రంగనాథ్ సీరియస్, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు...వీడియో
Arun Charagondaహైడ్రా పేరుతో పలువురు బిల్డర్లను బెదిరిస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైడ్రా పేరుతో కమిషనర్ రంగనాథ్ పేరు చెప్పి రూ.20 లక్షలు ఇవ్వాలంటూ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లోనూ MCOR Projects బిల్డర్లను బెదిరించాడు ఓ కేటుగాడు.
Mallareddy Funny Video: మల్లారెడ్డి - ఈటల రాజేందర్ ఫన్నీ సంభాషణ, ఫోటోలు మంచిగ రావాలని కామెంట్, ఈటలపై సరదా జోకులు...వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కీసర ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈటల, మల్లారెడ్డి.
Harishrao On Khammam Floods: ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం, ఎంపీ - ఎమ్మెల్యే- ఎమ్మెల్సీల ఒక నెల జీతం విరాళం ప్రకటించిన హరీశ్ రావు
Arun Charagondaఖమ్మం వరద బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వరద బాధితులను ఆదుకోవాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
Telangana Horror: మెదక్ జిల్లాలో దారుణం, దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు మీద వేశారని ముగ్గురిపై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి, ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ మెదక్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో రాములు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలపై గ్రామస్తుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాములు మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
IMD Weather Alert: విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది.
Telangana Floods: వీడియో ఇదిగో, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించలేం, రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyకేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Telangana Rains: మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Khammam: బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి అని వెల్లడి
Arun Charagondaనిన్న ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన కారు హరీశ్‌రావుదే అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రామ్మోహన్..కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి.. అందులో హరీశ్‌రావు కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
Heavy Rains In Medaram: మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్
Arun Charagondaభారీ వర్షాల ప్రతాపం మేడారం అడవులపై తీవ్ర ప్రభావం చూపింది. మేడారం-తాడ్వాయి మధ్య వేల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలి దుమారంతో 5కి.మీ పరిధిలో ఎటు చూసినా చెట్లు నాశనమయ్యాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Car Crash In USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి, పూర్తిగా కాలిపోయిన శరీరాలు
Arun Charagondaఅమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. మంటల్లో పూర్తిగా శరీరాలు కాలిపోయాయి. ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్),ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్),దర్శిని వాసుదేవన్ (తమిళనాడు), పాలచర్ల లోకేష్ చనిపోయిన వారిలో ఉన్నారు.
Hyderabad Rains : హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్‌లు
Arun Charagondaభాగ్యనగరం హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన
Vikas Mఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్
Hazarath Reddyరాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.