తెలంగాణ

Crows Attack: పగబట్టిన కాకులు.. మసుషులపై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన..వీడియో వైరల్‌

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టు‌పై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్‌ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.

Viral Video: భార్య - భర్తల గొడవ, భార్యను లాఠీతో కొట్టిన పోలీసులు, కరీంనగర్ -మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

కరీంనగర్ - మెట్ పల్లిలో అమానుషం చోటు చేసుకుంది. గొడవ పడి పోలీస్ స్టేషన్ కు వచ్చారు భార్యభర్తలు. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టారు పోలీసులు. ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి చేసుకున్నారు.

Telangana Shocker: అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Arun Charagonda

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement

BRS MLA Anil Jadav To Joins Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, త్వరలోనే చేరిక ఉండే అవకాశం?, 11వ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి?

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా?, ఓ వైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగడం లేదా?, తాజాగా 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

దొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్క‌లు, స‌గానికి పైగా తినడంతో ఆడా? మ‌గా? కూడా గుర్తుపట్ట‌ని రీతిలో శిశువు మృత‌దేహం

VNS

వరంగల్‌ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు

Advertisement

Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌, 3,000 మందికి ఉపాధి

Vikas M

అమెరికాకు చెందిన బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్‌ సిటీలో RMZ స్పైర్‌ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.

Telangana: నిజామాబాద్‌లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారి, అధికారుల కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు బయటకు, మొత్తం రూ. 6.70 కోట్లు స్వాధీనం

Hazarath Reddy

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్‌ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు.

Telangana Police: నల్గొండ ఎస్పీ మంచి మనసు, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

KTR On MLC Kavitha Bail: వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

Amgen Invests Hyderabad: తెలంగాణలో అమ్‌జెన్‌ బయోటెక్‌ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కాగా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్ బయోటెక్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.

Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Telangana Shocker: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్‌ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Viral Video: బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌

Arun Charagonda

హైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.

Advertisement

Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.

Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Suma in Real Estate Fraud: రియ‌ల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంక‌ర్ సుమ క‌న‌కాల‌, సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంక‌ర్

VNS

టాలీవుడ్ బుల్లితెరపై టాప్‌ యాంకర్‌ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్‌ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.

Advertisement
Advertisement