తెలంగాణ
New timings For Telangana Schools : తెలంగాణలో స్కూళ్ల టైమింగ్స్ లో మార్పు, అక్కడ తప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో అరగంట ముందుగానే ప్రారంభం
VNSతెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ (School Education) కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Sanathnagar SHO Suspended: అందంగా ఉన్నావ్, బయట కలుద్దామంటూ మహిళతో అసభ్యంగా చాటింగ్, కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సనత్ నగర్ సీఐ
VNSసనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిపై (Sanathnagar SHO) వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ (Cyberabad CP) ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల సీఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమర్శలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళకు సీఐ అసభ్య చాటింగ్ చేశారు
Mahankali Bonalu 2024: మహంకాళి బోనాలు సర్వం సిద్ధం, అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి,లక్షల సంఖ్యలో రానున్న భక్తులు
Arun Charagondaతెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు. ప్రతి ఏటా రాష్ట్ర పంండుగగా బోనాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో జరిగే ఆషాఢ బోనాలు ఎంతో ప్రత్యేకం.
Telangana Cabinet: 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
Telangana Shocker: అచ్చంపేటలో దారుణం, మద్యం తాగించి ఇద్దరు మహిళలపై అత్యాచారం, కారులోనే లైంగిక దాడి
Arun Charagondaమహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రయోజనం ఉండటం లేదు. దేశంలో ఏదో చోట, ఎక్కడో మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారం లేదా లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన సంఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.
Telangana Rains: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు నీట మునగగా ప్రజలను హెలికాప్టర్లతో రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు.
CM Revanth Reddy About Group 2 Exam: నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 వాయిదా వేశాం, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaనిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేశామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.
Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి
Arun Charagondaఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ఉదృతంగా ప్రవహిస్తుండగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Nagarkurnool Horror: నాగర్ కర్నూల్ లో దారుణం.. మద్యం తాగించి, ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం
Rudraనాగర్ కర్నూల్ లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Accident in Hyderabad: ట్యాంకర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మృతి.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
Rudraహైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు.
Three Students Died: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతి, ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
VNSకుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) లో ముగ్గురు విద్యార్థులు(Students) మృతి చెందారు. స్కోడా కారులో వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి (VNR Students) కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అతివేగంగా కారు(Car)ను నడుపుతూ లారీని ఢీ కొట్టారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, తప్ప తాగి 12 ఏండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని మేడిపల్లి పట్టణంలో తన 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు, ఒడిశాకు చెందిన 36 ఏళ్ల కూలీ, అతని భార్యను విడిచిపెట్టి, సాయినగర్ కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు.నివేదికల ప్రకారం, కుమార్తె పాఠశాల విద్యార్థిని, ఆమె హాస్టల్‌లో నివసించింది.
Telugu States Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలో మీటర్లు, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది
NDRF Rescues 28 People: వీడియో ఇదిగో, హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాలకు రెండు చోట్ల పెద్దవాగుకు గండి
Hazarath Reddyతెలంగాణ భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గతరాత్రి రెండుచోట్ల గండిపడింది
KTR Questions CM Revanth Reddy: చారాణ కోడికి బారాణ మసాలా, అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదు?, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్న
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుని గమనిస్తే చారాణ కోడికి..! బారాణ మసాలలా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా
Telangana Group 2 Postponed: తెలంగాణ గ్రూప్ 2 వాయిదా, డిసెంబర్‌లో పరీక్ష, త్వరలో తేదీలు ఖరారు
Arun Charagondaతెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. కొంతకాలంగా డీఎస్సీ కారణంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
CM Revanth Reddy to Visit America: అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన,ప్రవాస భారతీయులతో భేటీ
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.
Controversy on Double Ismart: వివాదంలో దర్శకుడు పూరి జగన్నాథ్, డబుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ డైలాగ్, పోలీసులకు బోడుప్పల్ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
Arun Charagondaపూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.
Hyderabad: వీడియో ఇదిగో, విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కరెంట్ కట్, సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దిన యువకుడు
Hazarath Reddyవిద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద ఓ యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు రూ. 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ ఉద్యోగి రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు.
Cyber Calls Alert: పోలీస్ డీపీతో కాల్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డీజీపీ ట్వీట్.. అసలేంటీ సంగతి??
Rudraకుటుంబ బంధాలను, మనుషుల ఎమోషన్స్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ‘మీ కుటుంబ సభ్యుడు ఓ నేరంలో ఇరుక్కున్నాడ’ని హడలగొడుతూ డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు.