తెలంగాణ

Telangana Assembly: రెండో రోజు సభకు రాని కేసీఆర్, ఆర్టీసీపై సభలో రగడ, హరీష్‌ - మంత్రి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం

Arun Charagonda

రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాబ్ క్యాలెండ్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

KTR Birthday: కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్ష

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రేవంత్, భగవంతుడు కేటీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Stock Market Fraud via WhatsApp: అమ్మాయి వాట్సాప్ చాట్, ఏకంగా స్టాక్ మార్కెట్‌లో కోటి ఇన్వెస్ట్‌మెంట్, తీరా చూస్తే?

Arun Charagonda

రోజుకో రూపంలో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. సైబర్ క్రైమ్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన దేశంలో ప్రతిరోజు ఏదో చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు సైతం ఈ మోసాల బారిన పడుతుండటం విశేషం. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక అమ్మాయి వాట్సాప్ చాట్ నమ్మి ఏకంగా కోటి రూపాయలు మోసపోయాడు ఓ వ్యక్తి. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana Shocker: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం

Arun Charagonda

తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

KCR Key Comments: అగ్నిపర్వ‌తంలా ర‌గిలిపోతున్నా! రాజ‌కీయ క‌క్ష‌తోనే నా కుమార్తెను జైల్లో పెట్టారు, బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశంలో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ (BRSLP) సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

CM Revanth Reddy on Budget: ప్రధాని మోదీకి ఎందుకింత కక్ష, బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Techie Suicide in Sangareddy: ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సూసైడ్ లెటర్

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పి ఎస్ పరిధిలోని BHEL విద్యుత్తు నగర్ లో కిరణ్ (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కారణాలు ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది

Theft Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయిన దొంగలు

Hazarath Reddy

తెలంగాణలో నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులో వచ్చి నిర్మల్‌లోని మయూరి హోటల్ దగ్గర నడుస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసుకి లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయ్యారు.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి స్కూలుకు వచ్చిన హెడ్ మాస్టర్, అడిగినందుకు గ్రామస్తులపై బూతులతో విరుచుకుపడిన తాగుబోతు...

Hazarath Reddy

ములుగు - వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్, గ్రామస్తులపై దుర్భాషలాడాడు

Farmer Suicide in Telangana: వీడియో ఇదిగో, అప్పులు కట్టలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య, భూమిని అమ్మితే కొడుకు ఏమవుతాడోననే బెంగతో..

Hazarath Reddy

నిర్మల్ - కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కూతురి పెండ్లి మరియు ఇల్లు కట్టడానికినికి రూ.25 లక్షల వరకు అప్పు అయింది. తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Hazarath Reddy

శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారి పై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను చాపలో చుట్టివేశాడు నిందితుడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు.

Telangana: తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement

Telangana Shocker: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ పట్టీ సాయంతో మీ డబ్బులను స్మార్ట్‌గా దొంగిలిస్తున్న మైనర్లు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్ తో అంటించి వెళ్లేవారు.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.

Telangana Assembly Session: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25వ తేదీన బ‌డ్జెట్, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో మెరిసిన సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌.. అసలేమిటీ బ్యాంక్?? దీని సక్సెస్ లో మున్సిపల్ కౌన్సిలర్ దంపతుల చొరవ ఏమిటీ??

Rudra

జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు మరోసారి మెరిసింది. సోమవారం పార్లమెంట్‌ లో సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Rs 25,000 Monthly Pension for Padma Shri Winners: ప‌ద్మశ్రీ అవార్డు గ్రహీత‌ల‌కు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rudra

ప‌ద్మశ్రీ పురస్కార గ్రహీత‌ల‌కు గౌరవ పింఛన్ ఇస్తామంటూ గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన జీవోను సోమవారం విడుదల చేసింది.

Advertisement

Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Telangana: వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Arogyasree: ఆరోగ్య‌శ్రీ‌లో మార్పులు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం, కొత్త‌గా 163 చికిత్స‌లు చేర్చిన స‌ర్కార్, ట్రీట్ మెంట్ ధ‌ర‌లు కూడా మార్చుతూ నిర్ణ‌యం

VNS

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (Arogyasree) చికిత్సకు సంబంధించిన ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో (GO 30) స్పష్టం చేసింది. అదే సమయంలో కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ (Arogyasree Treatments) నిర్ణయం తీసుకున్నది.

Telugu States Rain Update: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది.

Advertisement
Advertisement