తెలంగాణ

Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం

Rudra

తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.

DSC Exam Dates in Telangana: తెలంగాణలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు, టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను జారీ చేయనుంది.

Telangana Elections 2024: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు, అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్

Hazarath Reddy

మరో రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది

CM Revanth Reddy Meets Jithender Reddy: బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌ రెడ్డి, నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడని తెలిపిన బీజేపీ నేత

Hazarath Reddy

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం ఆశించగా హైకమాండ్ తేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది.

Advertisement

Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు వీళ్లే, మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్

Hazarath Reddy

రెండో జాబితాలో వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను నిర్ణయించారు

Telangana BJP MP Candidates List: తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేసే 15 మంది అభ్యర్థుల లిస్ట్ ఇదిగో, ఏపీ నుంచి ఇంకా తేలని కాషాయం పార్టీ అభ్యర్థులు

Hazarath Reddy

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లకు 72 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ రెండో జాబితాను బుధ‌వారం ప్ర‌క‌టించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, పీయూష్ గోయ‌ల్‌, హ‌రియాణా మాజీ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది.

418 Kidney Stones Removed From Patient: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించిన వైద్యులు, శరీరంపై కోత పెట్టకుండా కొద్దిపాటి శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు

Hazarath Reddy

60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఏకంగా 418 రాళ్లను వైద్యులు తీసేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఈ రాళ్లను తొలగించారు.

Telangana: వారి చావుకు కారణం ఆ రిపోర్టర్లు రూ. 25 లక్షలు బ్లాక్ మెయిల్ చేయడమే, ముగ్గురు కొడుకులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా టంగటూరు గ్రామంలో నీరటి రవి(35) అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్(13), మోహిత్ కుమార్(10), ఉదయ్ కిరణ్(7) లను చంపేసి.. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Advertisement

T-Safe: తెలంగాణ మహిళల కోసం రైడ్ మానిటరింగ్ సర్వీస్‌, టి-సేఫ్ సర్వీసును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎలా పనిచేస్తుందంటే..

Hazarath Reddy

మహిళల భద్రతను మెరుగుపరిచే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినూత్నమైన ట్రావెల్ సేఫ్ (టి-సేఫ్) సేవను ఆవిష్కరించి, ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర పౌరులకు అంకితం చేశారు. ఈ రైడ్ మానిటరింగ్ సర్వీస్, దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులచే అందించబడినది

Telangana: ఆరూరి రమేష్‌ ఇంటి వద్ద హైడ్రామా, రంగంలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తెలిపిన మాజీ ఎమ్మెల్యే

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత ఆరూరి రమేష్‌ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్‌ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు.

Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు, మాజీ SIB డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

ఎన్నికలలో BRS ఓడిపోయిన తర్వాత SIBలోని ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) DSP ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతని ఇంటి నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ప్రణీత్‌రావు ఉన్నారు.

Free Haleem Offer: వీడియో ఇదిగో, ఫ్రీ హలీం కోసం ఎగబడిన జనాలు, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఘటన

Hazarath Reddy

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్‌(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

Dedeepya Rao Attacked: బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ పై మహిళల దాడి, ఫ్లెక్సీ వివాదంలో దేదీప్యరావుపై దాడి చేసిన స్థానికులు, పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు

VNS

ఫ్లెక్సీల విషయంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Hyderabad Liberation Day: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

sajaya

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆమోదం తెలిపింది.

Bandi Sanjay on Lord Ram: రాముని పేరు చెప్పుకునే ప్రచారానికి వెళ్తాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, మీరు బాబర్ పేరు చెప్పుకుని వెళ్లండి అంటూ చురక

Hazarath Reddy

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి. రాముడు మా బీజేపీ వాళ్ళకే దేవుడు.. మేము బారాబర్ రాముడి పేరు చెప్పుకొనే ప్రచారం చేస్తామని బండి సంజయ్ అన్నారు.

Telangana Cabinet Meeting: కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ, రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కసరత్తు, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు.

Advertisement

Amit Shah Slams Congress: తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

Hazarath Reddy

తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై (Amit Shah Slams Congress) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Road Accident in Telangana: వీడియో ఇదిగో, ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్‌ను ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ

Hazarath Reddy

ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్ మంగళవారం కాన్వాయ్ వాహనం ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీగా ఉన్న పంకజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

TSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి, ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

Rudra

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.

Advertisement
Advertisement